అమిత్ షా చెప్పాడు.. Rx బదులు 'శ్రీహరి' అంటూ ఓ డాక్టర్ మొదలుపెట్టేశాడు
హిందీని రుద్దే కార్యక్రమం కేంద్రం మొదలుపెట్టింది. మొన్న అమిత్ షా మధ్యప్రదేశ్ లో హిందీలో మెడిసిన్ పాఠ్యాంశాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన ప్రిస్క్రిప్షన్ హీందీలోనే రాయాలని, ముందు శ్రీహరి అని మొదలు పెట్టాలని చెప్పారు. ఆయన మాటలను ఆచరిస్తూ ఓ డాక్టర్ ఆ పని మొదలు పెట్టేశాడు.
'పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టు' అన్నాడట వెనకటికి ఒకడు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ఇదే తంతు నడుస్తోంది. మధ్యప్రదేశ్ లోని సాత్నాలో డాక్టర్ సర్వేష్ సింగ్ ఓ పేషెంటుకు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ మొత్తం హిందీలోనే ఉండడం కాక ప్రారంభంలో' శ్రీ హరి' అని రాశారు. ఈ ప్రిస్క్రిప్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇటీవల ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. హిందీని ప్రోత్సహించేందుకు ఆ మాద్యమంలోనే వైద్య విద్యను బోధించాలంటూ ప్రతిపాదించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే హోంమంత్రి అమిత్ షా హిందీ మాద్యమంలో ఎంబిబిఎస్ పాఠ్య పుస్తకాలను విడుదల చేశారు. ఆ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు మందుల చీటీలు రాసేటప్పుడు శ్రీ హరి అని ప్రారంభించాలని చెప్పారు.
ఈ మాటలను తాను స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజు నుంచే ఎందుకు ప్రారంభించకూడదని తాను ఇలా రాయడం మొదలు పెట్టానని డాక్టర్ సర్వేష్ సింగ్ తెలిపారు. ప్రిస్క్రిప్షన్ మొత్తం ఇంగ్లీష్ లో రాసే స్టాండర్డ్ ప్రాక్టీస్ కు బదులు గా హిందీలోనే రాశారు. అంతేగాకుండా రోగికి మందులు రాసేటప్పుడు Rxకి బదులుగా 'శ్రీ హరి' అని రాశారు. ఫోటోలో చూసినట్లుగా, కడుపు నొప్పితో బాధపడుతున్న రోగికి ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారు. మందులేకాక రోగి వ్యాధి చరిత్ర మొత్తం కూడా హిందీలోనే రాయడం గమనార్హం.
Rx అనేది లాటిన్ పదం. దానికి ఔషదం తీసుకోండి అని అర్దం.
प्रदेश के मुख्यमंत्री श्री @ChouhanShivraj द्वारा #MP_में_हिंदी_में_MBBS की पढ़ाई कराने की निर्णय के बाद #सतना में एक चिकित्सक ने किया अमल। मरीजों को हिंदी में दवाई लिखना किया शुरू। प्राथमिक स्वास्थ्य केंद्र कोटर में चिकित्सा अधिकारी हैं डॉ सर्वेश सिंह। pic.twitter.com/aX6Ddr1Vrx
— Chetan Tiwari (@Chetantiwaribjp) October 16, 2022