నైరుతి వచ్చేస్తోంది.. ఈ ఏడాది మంచి వానలు
దక్షిణ అరేబియా సముద్రం నుంచి మాల్దీవులు, కేరళ, తమిళనాడు తీరం వరకు నైరుతి వ్యాపించబోతోంది. దీంతో ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ఆశిస్తోంది.
నైరుతి వచ్చేస్తోంది. ఈ రుతుపవనాలు మరో 5 రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. దక్షిణ అరేబియా సముద్రం నుంచి మాల్దీవులు, కేరళ, తమిళనాడు తీరం వరకు నైరుతి వ్యాపించబోతోంది. దీంతో ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ఆశిస్తోంది.
నైరుతిలో రెండేళ్లుగా అంతంతే
వేసవి ముగిసే దశలో నైరుతి రుతుపవనాలు వస్తాయి. దీంతో వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు విస్తృతంగా వర్షాలు కురుస్తాయి. అయితే గత కొన్నేళ్లుగా ఇది క్రమం తప్పింది. జూన్, జులై వరకు ఎండలు మండిపోతుండటం, ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో ఏదో కొద్దిగా వానలు తప్ప వానాకాలం అంతా చినుకూ జల్లూ పరిస్థితి లేదు. గత రెండేళ్లుగా పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉంది.
జలాశయాలు నిండక అవస్థలు
భారీ వర్షాలు లేకపోవడంతో కృష్ణా, గోదావరి నదుల్లో ప్రవాహం అంతంత మాత్రంగానే ఉంటుండటంతో జలాశయాల్లో జూన్, జులై నెలల వరకు నీటికి కటకటలే. ఈసారి నైరుతిలో మంచి వర్షాలు పడతాయన్న ఐఎండీ అంచనాలతో ఆశలు రేకెత్తిస్తున్నాయి.