Telugu Global
National

బీజేపీలో మోడీ ర్యాంకు 116.. కాంగ్రెస్ సెటైర్లు

వారణాసిలో ప్రధాని మోడీ మెజార్టీ సైతం గతం కన్నా భారీగా పడిపోయింది. తనకు తాను దైవాంశసంభూతుడిగా ప్రకటించుకున్న మోడీ.. కేవలం లక్షా 52 వేల మెజార్టీతో గట్టెక్కారు.

బీజేపీలో మోడీ ర్యాంకు 116.. కాంగ్రెస్ సెటైర్లు
X

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి బీజేపీ దూరంగా నిలిచిపోవడంతో కాంగ్రెస్ సెటైర్లు మొదలుపెట్టింది. ప్రధానంగా అబ్‌ కీ బార్‌.. చార్ సౌ పార్‌ నినాదం ఎత్తుకున్న బీజేపీకి చురకలు అంటిస్తోంది. ఇక కంచుకోట లాంటి యూపీలో బీజేపీ దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. యూపీలో 37 సీట్లతో ఎస్పీ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. బీజేపీ రెండో స్థానానికి పడిపోయింది. 2019 ఎన్నికలతో పోల్చితే.. యూపీలో బీజేపీ 35కుపైగా స్థానాలను కోల్పోయింది.

ఇక వారణాసిలో ప్రధాని మోడీ మెజార్టీ సైతం గతం కన్నా భారీగా పడిపోయింది. తనకు తాను దైవాంశసంభూతుడిగా ప్రకటించుకున్న మోడీ.. కేవలం లక్షా 52 వేల మెజార్టీతో గట్టెక్కారు. బీజేపీ తరపున ఎన్నికైన 240 మంది ఎంపీల మెజార్టీ చూస్తే మోడీ 116వ స్థానంలో ఉన్నారు. దీనిపైనే సెటైర్లు వేసింది కాంగ్రెస్‌. NDA కూటమి ఎంపీల మెజార్టీ తీసుకుంటే మోడీ ర్యాంకు ఇంకా దిగజారుతుందంటూ ఎద్దేవా చేసింది.

బీజేపీలో మెజార్టీ పరంగా ఇండోర్ ఎంపీ శంకర్‌ లాల్వాని ఫస్ట్ ప్లేసులో ఉన్నారు. ఆయన దాదాపు 11 లక్షల 75 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక రెండో స్థానంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. ఆయన 8 లక్షల 21 వేల మెజార్టీతో విజయం సాధించారు. ఇక అమిత్ షా 7 లక్షల 44 వేలకుపైగా మెజార్టీతో ఐదో ప్లేసులో నిలిచారు.

First Published:  6 Jun 2024 9:07 AM GMT
Next Story