Telugu Global
National

మోడీ Vs కేజ్రీవాల్: సొంత విమానానికి పెట్టిన డబ్బెంత ? ఇంటి రిపేర్లకు ఖర్చెంత ?

45 కోట్లు వెచ్చించి సీఎం కేజ్రీవాల్ ప్యాలెస్ కట్టిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తున్నది. అదే నిజమైతే లెఫ్టి నెంట్ గవర్నర్ ఈ నివాసాన్ని తాను తీసుకొని తన ఇంటిని కేజ్రీవాల్ కు ఇవ్వాలని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ట్వీట్ చేశారు.

మోడీ Vs కేజ్రీవాల్: సొంత విమానానికి పెట్టిన డబ్బెంత ? ఇంటి రిపేర్లకు ఖర్చెంత ?
X

మోడీ Vs కేజ్రీవాల్: స్వంత విమానానికి పెట్టిన డబ్బెంత ? ఇంటి రిపేర్లకు ఖర్చెంత ?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసానికి రిపేరులు చేయిస్తున్నారు. దాని కోసం ఆయన 45 కోట్లు ఖర్చుపెడుతున్నారని బీజేపీ ఆరోపించింది. అందుకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు కేజ్రీవాల్ నివాసం ముందు ధర్నా నిర్వహించారు. కేజ్రీవాల్ ప్రజాధనాన్ని తన విలాసాల‌ కోసం ఖర్చుపెడుతున్నారని ఆరోపించిన బీజేపీ నేతలు ఆయన విలాసవంతమైన రాజు' అని విమర్శించారు.

కాగా బీజేపీ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. కేజ్రీవాల్ అధికారిక నివాసం 80 ఏళ్ళ 'పురాతనమైదని, ఇల్లంతా పాడైపోయి, పైకప్పు ఊడి కిందపడుతోందని, మూడు సార్లు పైకప్పులు కూలిన సంఘటనలు జరిగాయని, అటువంటి ఇంటిని రెనోవేట్ చేయడం తప్పెలా అవుతుందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ప్రశ్నించారు.

కోవిడ్ మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ తన కోసం 8,400 కోట్ల రూపాయల విలువైన విమానాన్ని కొనుగోలు చేశారని సంజయ్ సింగ్ ఆరోపించారు.

మోడీ ఇంటి మరమ్మతుల కోసం రూ. 500 కోట్లు , ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇల్లు మరమ్మతుల కోసం రూ. 15 కోట్లు, గుజరాత్ సీఎం విమానానికి రూ. 191 కోట్లు ఖర్చు చేశారని సంజయ్ సింగ్ ఆరోపించారు.

45 కోట్లు వెచ్చించి సీఎం కేజ్రీవాల్ ప్యాలెస్ కట్టిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తున్నది. అదే నిజమైతే లెఫ్టి నెంట్ గవర్నర్ ఈ నివాసాన్ని తాను తీసుకొని తన ఇంటిని కేజ్రీవాల్ కు ఇవ్వాలని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ట్వీట్ చేశారు.

మొత్తానికి రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వారి విలాసాల కోసం ఎంతెంత ప్రజల సొమ్మును ఖర్చుపెడుతున్నారో బహిర్గతపర్చుకోవడం ఒకందుకు మంచిదే.

First Published:  26 April 2023 10:25 AM GMT
Next Story