మోడీ, అదానీల బంధం ఈనాటిది కాదు.... పార్లమెంటులో రాహుల్ గాంధీ
''2014కి ముందు, గౌతమ్ అదానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 609వ స్థానంలో ఉన్నారు. కానీ, 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే గౌతమ్ అదానీ రెండో స్థానానికి చేరుకున్నారు.'' అని రాహుల్ గాంధీ అన్నారు
ప్రస్తుతం దేశంలో అదానీ స్కాం చర్చనీయాంశమైంది. దీనిపై విపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై పార్లమెంటులో కూడా అధికార పక్షం ప్రతి రోజూ విపక్షాల నిరసనలను చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంటులో మాట్లాడుతూ మోడీ, అదానీల బంధం గురించి నిప్పులు చెరిగారు. రాహుల్ గౌతమ్ అదానీ, నరేంద్ర మోడీలు కలిసి ఓ ప్రత్యేక విమానంలో వెళ్తున్న ఫోటోను చూపించి, వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రశ్నించారు. అదానీల కోసం ప్రభుత్వం అనేక నిబంధనలు మార్చి వారికి సాయం చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘భారత్ జోడో యాత్రలో నేను చాలా రాష్ట్రాల్లో పర్యటించాను. నేను ఎక్కడికి వెళ్లినా గౌతమ్ అదానీ పేరు మాత్రమే విన్నాను. రాహుల్ జీ... అదానీ అకస్మాత్తుగా అనేక రంగాల్లో అందరికన్నా ముందుకెలా వెళ్ళారు. అని ప్రజలు అడిగేవారు. కొన్నేళ్ల క్రితం అదానీకి ఒకటి రెండు వ్యాపారాలు మాత్రమే ఉండేవి, ఇప్పుడు ఎనిమిది, పది వ్యాపారాలు ఉన్నాయి.’
''2014కి ముందు, గౌతమ్ అదానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 609వ స్థానంలో ఉన్నారు. కానీ, 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే గౌతమ్ అదానీ రెండో స్థానానికి చేరుకున్నారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న సంబంధం ఏమిటి? కొన్ని సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనల వల్ల చాలా మంది మోడీని వ్యతిరేకించారు. కానీ, ఆ సమయంలో అదానీ మాత్రమే మోదీకి అండగా నిలిచారు.'' అని రాహుల్ అన్నారు.
‘'2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక అసలు మ్యాజిక్ మొదలైంది. కొన్ని సంవత్సరాలలో, అదానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో రెండవ స్థానానికి చేరుకున్నారు. కొన్నేళ్ల క్రితమే విమానాశ్రయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అనుభవం లేని వారికి ఎయిర్‌పోర్టు ఇవ్వకూడదని అప్పట్లో నిబంధన ఉండేది. కానీ, ఈ నిబంధనను బీజేపీ ప్రభుత్వం మార్చివేసి విమానాశ్రయాలను ప్రైవేటీకరించి ఆరు విమానాశ్రయాలను అదానీ కి ఇచ్చింది. దీని తర్వాత, అదానీ దేశంలోని చాలా విమాన ట్రాఫిక్‌ను తన సొంత విమానాశ్రయాలకు మళ్లించారు'' అని రాహుల్ పార్లమెంటులో ఆరోపించారు.
ఇక్కడొతో ఆగలేదు నరేంద్ర మోడీ బంగ్లాదేశ్‌కు వెళ్ళారు. అక్కడ గౌతమ్ అదానీకి పెద్ద పవర్ ప్రాజెక్ట్ వచ్చింది. దీని తర్వాత మోడీ శ్రీలంక వెళ్లి అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అదానీకి అతి పెద్ద విండ్ పవర్ ప్రాజెక్టు ఇప్పించారు. ప్రభుత్వ సంస్థ అయిన ఎల్‌ఐసి కూడా అదానీ కంపెనీలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా చాలా సహాయం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థలో అదానీ జోక్యం చేసుకుంటుంది, రక్షణ రంగంలో జోక్యం చేసుకుంటుంది. డొల్ల కంపెనీల ద్వారా భారత్‌లోకి డబ్బు తెస్తున్నారు. ఈ కంపెనీలు ఎవరికి చెందినవో తనిఖీ చేయడం ప్రభుత్వ పని.'' అని రాహుల్ అన్నారు.
కొత్తగా వస్తున్న వ్యాపారులకు, వాణిజ్య సంస్థలకు ఇదొక నమూనా అని దీనిపై రీసెర్చ్ చేయాలని రాహుల్ అన్నారు. దీని ద్వారా ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగిం చి, వ్య క్తుల వ్యా పార సామ్రాజ్యాలను ఎలా అభివృధ్ది చేయాలో స్పష్టమౌతుం దని ఆరోపించారు. రక్షణ రంగం లోకి కూడా అదానీ ప్రవేశిం చారని, ఎల్బిట్ కంపెనీతో కలిసి భారత్ లో అదానీ డ్రోన్ లను తయారు చేస్తారని, ఈడ్రోన్లను భారత్ త్రివిధ దళాలకు సరఫరా చేస్తారని రాహుల్ గాంధీ అన్నారు. అదానీ గతంలో డ్రోన్ల తయారీ ఎప్పుడూ చేయలేదని చెప్పిన రాహుల్, ప్రధాని ఇజ్రాయిల్ వెళ్తారు.. తర్వా త అదానీకి సంబంధిత కాం ట్రాక్ట్ వస్తుంది అంటూ ఆయన ఆరోపిం చారు. భారత్-ఇజ్రాయిల్ రక్షణ సంబంధాలు ధనికుల చేతుల్లోకి వెళ్లిపోయాయని అన్నారు. ఇం దులో పెగాసిస్ కూడా ఉం దని విమర్శిం చారు. భారత రక్షణ రం గానికి ఎలక్ట్రానిక్స్ ను సరఫరా చేసే “అల్ఫా డీఫెన్స్ ” అనే కంపెనీని కూడా అదానీ కైవసం చేసుకున్నారని రాహుల్ పేర్కొ న్నారు.