Telugu Global
National

నేటితో ప్రచారం ముగింపు.. మోదీ, అమిత్ షా ఏం చేస్తున్నారంటే..?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఈరోజు ప్రచారం ముగించుకుని ఏపీకి వస్తున్నారు. అమిత్ షా ఈరోజు రాత్రి 7:30 గంటలకు తిరుమలకు చేరుకుంటారు.

నేటితో ప్రచారం ముగింపు.. మోదీ, అమిత్ షా ఏం చేస్తున్నారంటే..?
X

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నేటితో ప్రచారం ముగుస్తుంది. జూన్-1న ఏడో దశ పోలింగ్ పూర్తయితే.. దేశంలో లోక్ సభ ఎన్నికల సంగ్రామం పరిపూర్ణం అయినట్టు. నేటితో ప్రచారం ముగిస్తే కీలక నేతలు ఏం చేస్తారనేది ఆసక్తికర అంశంగా మారింది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా.. ఈ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా పర్యటనలు చేశారు. ఎక్కడ ఎన్నికలుంటే ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు. ఈరోజుతో ఎన్నికల ప్రచార పర్వం ముగుస్తుంది కాబట్టి.. వారిద్దరూ సైలెంట్ గా హిందూ ఓటర్లను ఆకర్షించే మరో ప్రయత్నానికి సిద్ధమయ్యారు.

తిరుమలకు అమిత్ షా..

ఏపీలో పోలింగ్ పూర్తయింది కాబట్టి.. రాజకీయ నాయకుల కదలికలపై ఆంక్షలు లేవు. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఈరోజు ప్రచారం ముగించుకుని ఏపీకి వస్తున్నారు. అమిత్ షా ఈరోజు రాత్రి 7:30 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. రేపు(శుక్రవారం) ఉదయం 8.30 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి రాజ్ కోట్ కు బయలుదేరుతారు.

మోదీ ఆధ్యాత్మిక ధ్యానం..

ఎన్నికల ప్రచారం తర్వాత ప్రధాని మోదీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే మోదీ తమిళనాడులోని వివేకానంద రాక్ మెమోరియల్‌ కి వస్తారు. అక్కడ 48 గంటలు ఆయన ఆధ్యాత్మిక ధ్యానంలో పాల్గొంటారని అంటున్నారు. మొత్తమ్మీద ఎన్నికల ప్రచారం ముగిసినా కూడా మోదీ, అమిత్ షా.. హిందూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన పెట్టుకున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

First Published:  30 May 2024 7:29 AM IST
Next Story