ర్యాలీలో రాసక్రీడ.. మహిళా నేతకు ఎమ్మెల్యే ముద్దు..!
ముద్దు పాటలు జోడించి వీడియోని వైరల్ చేశారు కొంతమంది. ఆ వీడియో వైరల్ కావడంతో బీజేపీ పరువుపోయింది. బహిరంగంగా ఎమ్మెల్యే అసభ్యంగా ప్రవర్తించారంటూ నెటిజన్లు మండిపడ్డారు.
మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన షిండే సేన ఎమ్మెల్యే ప్రకాష్ పేరు ఇప్పుడు అక్కడ మారుమోగిపోతోంది. ఓ ర్యాలీలో మహిళా నాయకురాలికి ఆయన ముద్దిచ్చారని, వారిద్దరూ ర్యాలీలోనే ముద్దు ముచ్చట్లు పెట్టుకున్నారని ఓ వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. దీంతో సీఎం ఏక్ నాథ్ షిండేని కూడా టార్గెట్ చేస్తూ శివసేన ఉద్ధవ్ వర్గం గొడవ చేసింది. ఎమ్మెల్యే రాజీనామా చేయాలని ఉద్ధవ్ వర్గం నేతలు డిమాండ్ చేశారు.
అసలేం జరిగింది..?
మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే పాల్గొన్న ర్యాలీలో ఓ వాహనంలో ఎమ్మెల్యే ప్రకాష్ సర్వే ఉన్నారు. అదే వాహనంలో ఆయన వెనక మహిళా నాయకురాలు శీతల్ మాత్రే ఉన్నారు. ఓ సందర్భంలో ఆమె, ఎమ్మెల్యే భుజంపై చేయివేసి పిలుస్తుంది, వెనక్కు వంగిన ప్రకాష్ ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. అయితే శీతల్ కూడా పెద్దగా అభ్యంతరం చెప్పదు, ఆమె కూడా ఆయనకు దగ్గరగా వస్తుంది. ఇదీ ఆ వీడియోలో ఉన్న కంటెంట్. దీనికి ముద్దు పాటలు జోడించి ఓ రేంజ్ లో వైరల్ చేశారు కొంతమంది. ఆ వీడియో వైరల్ కావడంతో బీజేపీ పరువుపోయింది. బహిరంగంగా ఎమ్మెల్యే అసభ్యంగా ప్రవర్తించారంటూ నెటిజన్లు మండిపడ్డారు.
खुल्लम खुल्ला प्यार करेंगे हम दोनो. .. .. pic.twitter.com/6ubh6gg4MZ
— जाग्रुत जनता (@foundat11) March 12, 2023
ముద్దు నిజం కాదు, మార్ఫింగ్..
అయితే ఆ వీడియో నిజం కాదని, మార్ఫింగ్ చేసి, తాము ముద్దు పెట్టుకున్నట్టుగా చూపించారని ఎమ్మెల్యే మండిపడ్డారు. తన పరువు తీసేందుకు, తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకే ఆ మార్ఫింగ్ వీడియోని వైరల్ చేశారన్నారు ఎమ్మెల్యే ప్రకాష్. ఆయన కుటుంబ సభ్యులు మార్ఫింగ్ వీడియోపై కేసు పెట్టారు. కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిద్దరూ సోషల్ మీడియాలో ఆ వీడియోని వైరల్ చేశారని తేల్చారు.
राजकारणामधील महिलेसंदर्भात बोलण्यासारखे काही नसले तर तिचे चारित्र्यहनन करणे हेच उद्ध्वस्त गटाचे संस्कार आहेत?? मातोश्री नावाच्या fb पेजवरुन एका स्त्री संदर्भात असा morphed video upload करताना बाळासाहेबांचे संस्कार नाही का आठवले? pic.twitter.com/rpaqbMtiZU
— sheetal mhatre (@sheetalmhatre1) March 11, 2023
ఇదేనా మీ సంస్కృతి..
ఆ వీడియోలో కనిపించిన మహిళా నేత శీతల్ మాత్రే కూడా నెటిజన్లపై విరుచుకుపడ్డారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. రాజకీయాల్లో ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకు ఇంత నీచానికి దిగజారుతారా? అని ప్రశ్నించారు. మాతోశ్రీ అనే ఫేస్ బుక్ పేజ్ నుంచి ఆ వీడియో అప్ లోడ్ చేశారని, ఆ సమయంలో మీకు బాలాసాహెబ్ సంస్కారం గుర్తుకు రాలేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు శీతల్. ఉద్ధవ్ వర్గం కుట్రపూరితంగా ఆ వీడియో వైరల్ చేసిందన్నారామె.