Telugu Global
National

రీల్స్ చేసుకుందాం వస్తావా? డియర్.. కాబోయేవాడిని పిలిచి గొంతు కోసింది..

కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతి(17)కి ఇటీవల పెళ్లి నిశ్చయ‌మైంది. కానీ ఆమెకు పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే ఆమె మ‌రో యువకుడిని ప్రేమిస్తోంది. ఆ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా కాబోయేవాడిని చంపేస్తే అడ్డు తొలగుతుందని భావించింది.

రీల్స్ చేసుకుందాం వస్తావా? డియర్..    కాబోయేవాడిని పిలిచి గొంతు కోసింది..
X

సినిమాల ఎఫెక్ట్ వల్లో, వెబ్ సిరీస్‌ల ప్ర‌భావం పడుతుందో కానీ ప్రస్తుత యువతలో నేర సంస్కృతి రోజురోజుకూ పెరిగిపోతుంది. తమ జీవితానికి, సుఖానికి ఎవరైనా అడ్డుగా ఉన్నారని తెలిస్తే చాలు అడ్డు తొలగించుకునేందుకు రకరకాలుగా ప్లాన్లు వేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతికి ఇటీవల పెళ్లి నిశ్చయ‌మైంది. కానీ ఆమెకు పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే ఆమె మ‌రో యువకుడిని ప్రేమిస్తోంది. ఆ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా కాబోయేవాడిని చంపేస్తే అడ్డు తొలగుతుందని భావించింది. తెలివిగా అతనికి దగ్గరై కత్తితో గొంతు కోసింది. ఈ సంఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

హవేరీ జిల్లాలోని ఓ యువతి(17) ఈ దారుణానికి తెగబడింది. కాబోయే భర్తను రీల్స్ చేద్దామంటూ పిలిచి గొంతు కోసింది. ఆ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. హవేరీకి చెందిన యువతికి ఇటీవల దేవేంద్ర గౌడ(23) అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. బాలిక మేజర్ అయ్యాక వివాహం జరిగేలా తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ పెళ్లి బాలికకు ఇష్టం లేదు. తను మరో యువకుడిని ప్రేమిస్తుండటమే అందుకు కారణం..

ఇదిలా ఉంటే పెళ్లి ఆపాలంటే .. కాబోయేవాడిని చంపడం ఒక్కటే మార్గమని భావించి యువతి స్కెచ్ వేసింది. అతడితో కొన్ని రోజులు ప్రేమగా మాట్లాడింది. ఇన్ స్టా రీల్స్ చేసుకుందామంటూ పిలిచింది. ఆమె మాటలు నమ్మిన దేవేంద్ర గౌడ యువతి చెప్పిన చోటుకు వెళ్లాడు. ముందుగా ఇద్దరూ కలిసి కొన్ని రీల్స్ చేశారు. ఆ తర్వాత ఓ రీల్ చేద్దామంటూ దేవేంద్ర గౌడను .. యువతి గొలుసులతో కట్టేసింది. అనంతరం కత్తితో గొంతు కోసి పారిపోయింది. స్థానికులు గమనించి అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

First Published:  10 April 2023 11:41 AM IST
Next Story