Telugu Global
National

కేంద్ర న్యాయ శాఖ‌లో మరో మార్పు.. - స‌హాయ మంత్రినీ మార్చేశారు

న్యాయశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఎస్.పి.సింగ్ బఘేల్‌ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా బదిలీ చేస్తున్న‌ట్టు ఆ ఉత్త‌ర్వులో పేర్కొన్నారు.

కేంద్ర న్యాయ శాఖ‌లో మరో మార్పు.. - స‌హాయ మంత్రినీ మార్చేశారు
X

కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజును ఆ బాధ్య‌త‌ల‌ నుంచి త‌ప్పిస్తూ ఉత్త‌ర్వులు వెలువడిన కొద్ది గంట‌ల వ్య‌వ‌ధిలోనే అదే శాఖ‌లో మ‌రో మార్పు జ‌రిగింది. న్యాయ శాఖ స‌హాయ మంత్రిని కూడా వేరే స్థానానికి బ‌దిలీ చేస్తూ రాష్ట్రప‌తి భ‌వ‌న్ నుంచి గురువారం సాయంత్రం ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి. న్యాయశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఎస్.పి.సింగ్ బఘేల్‌ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా బదిలీ చేస్తున్న‌ట్టు ఆ ఉత్త‌ర్వులో పేర్కొన్నారు.

న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజును తొలగించి ఆ శాఖను కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. న్యాయశాఖకు స్వతంత్ర మంత్రిగా మేఘ్వాల్ ఈ బాధ్యతలు స్వీకరించారు. సంప్రదాయం ప్రకారం.. ఓ శాఖను స్వతంత్ర హోదాలో నిర్వహిస్తున్న మంత్రికి డిప్యూటీ ఉండరు. అందుకే.. బఘేల్‌ను మరో శాఖకు పంపించినట్టు అధికారులు వెల్లడించారు.

First Published:  19 May 2023 2:58 AM
Next Story