Telugu Global
National

ఆ దొంగ లెవెలే వేరు… నేపాల్లో సొంత హోటల్ , యూపీ లో గెస్ట్ హౌస్, లక్నోలో ఇల్లు..

ఢిల్లీ పోలీసులు చోరీ కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు తెలుసుకొనే ప్రయత్నం చేసి అవాక్కాయ్యారు. ఎందుకంటే అతనో హోటల్ కి యజమాని, అదికాక ఒక ఇల్లు, ఒక గెస్ట్ హౌస్.. భారీగా ఆస్తులు అతని సొంతం.

ఆ దొంగ లెవెలే వేరు… నేపాల్లో సొంత హోటల్ , యూపీ లో గెస్ట్ హౌస్, లక్నోలో ఇల్లు..
X

ఢిల్లీ పోలీసులు చోరీ కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు తెలుసుకొనే ప్రయత్నం చేసి అవాక్కాయ్యారు. ఎందుకంటే అతనో హోటల్ కి యజమాని, అదికాక ఒక ఇల్లు, ఒక గెస్ట్ హౌస్.. భారీగా ఆస్తులు అతని సొంతం. 200 దొంగతనాలు చేసి 9 సార్లు అరెస్ట్ అయిన అతను దొంగ అని కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియదు అంటే అసలు అలా ఎలా మెయింటైన్ చేసాడో అని ఆశ్చర్య పోవడం పోలీసులవంతైంది.

వివరాలలోకి వెళితే..

మనోజ్‌ చౌబే కుటుంబం యూపీలోని సిద్దార్థనగర్‌లో ఉండేది. తరువాత వారి కుటుంబం నేపాల్‌కు తరలివెళ్లింది. మనోజ్‌ 1997లో ఢిల్లీ వచ్చాడు. కీర్తినగర్‌ పోలీస్‌స్టేషన్‌లో క్యాంటీన్‌ నిర్వహించాడు. అక్కడే చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో అతనిని జైలుకు తరలించారు. జైలు నుంచి వచ్చాక అప్డేట్ అయిన మనోజ్ ఇళ్లను టార్గెట్‌ చేస్తూ దొంగతనాలు మొదలుపెట్టాడు. భారీ మొత్తంలో సొమ్ము పోగేశాక గ్రామానికి వెళ్లిపోయేవాడు. తరువాత ఈ చోరీ సొమ్ముతో మనోజ్‌ నేపాల్‌లో హోటల్‌ నిర్మించాడు. ఈ సమయంలోనే ఢిల్లీలో పార్కింగ్‌ కంట్రాక్టు పనులు చేస్తుంటానని చెప్పి యూపీలోని ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. కాంట్రాక్టు పనుల కోసం తాను ఆరు నెలలకు ఒకసారి ఢిల్లీ వెళ్లవలసి ఉంటుందని నమ్మబలికాడు. అలా చక్కగా మేనేజ్ చేస్తూ భార్య పేరుతో ఒక గెస్ట్ హౌస్ నిర్మించాడు. ఒక ల్యాండ్ ను కొని ఆసుపత్రి స్థలానికి లీజ్ కి ఇచ్చిన నెలకు రెండు లక్షలు అద్దెగా వసూలు చేస్తున్నాడు. ఇది కాక అతనికి లక్నోలో మరో ఇల్లుంది. ఇలా గత కొన్ని సంవత్సరాలనుండి కుటుంబానికి కూడా తెలియకుండా లోపల దొంగగా, బయట కోటేశ్వరుడిగా 25 ఏళ్లుగా గడిపేస్తున్నాడు. సాక్షాలు దొరకకుండా చేయటం, ఒకవేళ పట్టుబడినా, అసలైన వివరాలు చెప్పకుండా ఉండటం, రికవరీ చేయడానికి డబ్బులు చేతిలో పెట్టుకోకపోవడం లాంటి కారణాలతో అతను ఎప్పుడూ పెద్దగా ఇబ్బందులు పడలేదు.

అయితే కొద్ది రోజుల క్రితం మోడల్‌ టౌన్‌ పోలీసులు ఒక ఇంటిలో చోరీకి పాల్పడ్డాడనే ఆరోపణలతో మనోజ్ను అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తే ఇతనిపై 2001 నుంచి 2023 వరకూ 15కు పైగా నేరపూరిత కేసులు ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటికీ 9 సార్లు అరెస్ట్ అయ్యి విడుదల అయ్యాడు మనోజ్. దొంగతనం చేసిన వెంటనే మనం ఆ వస్తువుల రూపం మార్చి అమ్మేసేవాడు. ఇప్పుడు కూడా అతని నుంచి లక్ష రూపాయలు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

First Published:  16 Aug 2023 5:45 PM IST
Next Story