Telugu Global
National

ఐటీ ఉద్యోగులకు మెటబాలిక్ సిండ్రోమ్..

మెటబాలిక్ సిండ్రోమ్ తో అందరికీ వెనువెంటనే ప్రాణాపాయం ఉండదు కానీ రిస్క్ చాలా ఎక్కువ. సడన్ గా గుండెపోటు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. క్రమంగా ఊబకాయం వస్తుంది.

ఐటీ ఉద్యోగులకు మెటబాలిక్ సిండ్రోమ్..
X

ఐటీ ఉద్యోగం. కూర్చుని చేసే పని. ఆఫీస్ కి వెళ్లి పనిచేసినా, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా, హైబ్రిడ్ మోడ్ అయినా.. సగటు ఐటీ ఉద్యోగి రోజుకి 8 గంటలు పైగా కంప్యూటర్ లేదా, ల్యాప్ టాప్ ముందు కూర్చుని ఉండాల్సిందే. ఇలాంటి వారినే ఇప్పుడు మెటబాలిక్ సిండ్రోమ్ చుట్టుముడుతోంది. ఐటీతో సంబంధం లేకపోయినా ఎక్కువసేపు కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవారంతా దీని బాధితులే.

భారతీయ వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్‌) నేతృత్వంలో జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) మెటబాలిక్ సిండ్రోమ్ పై ఓ అధ్యయనం నిర్వహించింది. పెద్ద, మధ్య తరహా, చిన్న ఐటీ కంపెనీల్లో విస్తృత స్థాయిలో అధ్యయనం చేపట్టింది. ఉద్యోగాల స్వభావం, ఉద్యోగుల ఆహార అలవాట్లు, జీవనశైలి, వారి ఆరోగ్యం వంటి వివరాలను సేకరించి విశ్లేషించింది. 46శాతం మందికిపైగా మెటబాలిక్‌ సిండ్రోమ్‌ బారినపడినట్టు గుర్తించింది.

ఏంటీ వ్యాధి..?

మన శరీరంలో క్రమంగా జరగాల్సిన జీవక్రి­య­ల్లో తేడాలు రావడం, లోపాలు చోటు చేసుకోవడ­మే మెటబాలిక్‌ సిండ్రోమ్‌. ఊబకాయం, ట్రైగ్లిజ­రైడ్స్, హై డెన్సిటి లిపో ప్రోటీన్ (HDL), రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి­లు.. అనే ఐదు ప్రధాన రిస్క్‌ ఫ్యాక్టర్లను బట్టి దీన్ని నిర్ధారిస్తారు. మెటబాలిక్ సిండ్రోమ్ తో అందరికీ వెనువెంటనే ప్రాణాపాయం ఉండదు కానీ రిస్క్ చాలా ఎక్కువ. సడన్ గా గుండెపోటు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. క్రమంగా ఊబకాయం వస్తుంది.

ఏం చేయాలి..?

మెటబాలిక్ సిండ్రోమ్ కి వ్యాయామం ప్రధాన విరుగుడు. ఐటీ ఉద్యోగులే కాదు, సాధారణ ఉద్యోగాలు చేసేవారు కూడా వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. వ్యాయామంతో మెటబాలిక్ సిండ్రోమ్ తోపాటు ఇతర అనేక వ్యాధుల్ని కూడా దూరం పెట్టే అవకాశముందని చెబుతున్నారు నిపుణులు. ఇక మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడకుండా ఉండాలంటే.. ?

- ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్‌ పూర్తిగా తగ్గించాలి.

- కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి, కాయగూరలు, పండ్లు తినాలి.

- ప్రతి రోజూ సమయానికి ఆహారం తీసుకోవాలి.

- వీలైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండాలి.

- వ్యాయామం తప్పనిసరి.

First Published:  19 Aug 2023 8:06 AM IST
Next Story