Telugu Global
National

ప్రధాని మోడీ సభకు అనుమతి నిరాకరణ‌

ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సొంత నియోజకవర్గం సౌత్ తురాలోని పీఏ సంగ్మా స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీని నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర క్రీడా విభాగాన్ని అనుమతి కోరింది. అయితే స్టేడియం నిర్మాణ పనులు ఇంకా సాగుతున్నందున అనుమతి ఇవ్వలేమని క్రీడా శాఖ బీజేపీకి జవాబు ఇచ్చింది.

ప్రధాని మోడీ సభకు అనుమతి నిరాకరణ‌
X

మేఘాలయలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బీజేపీ తరపున ప్రధాని మోడీ ప్రచారం చేయడానికి మేఘాలయలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి)ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సొంత నియోజకవర్గం సౌత్ తురాలోని పీఏ సంగ్మా స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీని నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర క్రీడా విభాగాన్ని అనుమతి కోరింది. అయితే స్టేడియం నిర్మాణ పనులు ఇంకా సాగుతున్నందున అనుమతి ఇవ్వలేమని క్రీడా శాఖ బీజేపీకి జవాబు ఇచ్చింది.

నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నందున, సైట్‌లో పెద్ద ఎత్తున ఉంచిన మెటీరియల్ ప్రధానికి భద్రతా సమస్యలను సృష్టిస్తాయి కాబట్టి స్టేడియంలో ఇంత పెద్ద సమావేశాన్ని నిర్వహించడం సరికాదని క్రీడా విభాగం తెలియజేసింది.

ఈ పరిణామంపై స్పందించిన బీజేపీ, అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి), తృణమూల్ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి రాష్ట్రంలో "కాషాయ‌ పార్టీ వేవ్" ను ఆపడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది.

రూ.127 కోట్లతో నిర్మించిన ఈ స్టేడియానికి కేంద్రం 90 శాతం నిధులు ఇచ్చింది. గతేడాది డిసెంబర్ 16న సీఎం ఈ స్టేడియాన్ని ప్రారంభించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రితురాజ్ సిన్హా మాట్లాడుతూ..

స్టేడియం ప్రారంభించిన రెండు నెలల తర్వాత కూడా స్టేడియం అసంపూర్తిగా ఉందని ఎలా ప్రకటించారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

కొన్రాడ్ సంగ్మా, ముకుల్ సంగ్మా మమ్మల్ని (బీజేపీ) చూసి భయపడుతున్నారా? మేఘాలయలో బీజేపీ వేవ్‌ను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. మీరు ప్రధాని ర్యాలీని ఆపడానికి ప్రయత్నించవచ్చు, కానీ రాష్ట్ర ప్రజలు (బీజేపీకి మద్దతు ఇవ్వాలని) నిర్ణయించుకున్నారు. " అని రితురాజ్ సిన్హా అన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల సభ‌లకు ప్రజల స్పందన చూసి ఇతర పార్టీలకు దిక్కుతోచడంలేదని సిన్హా అన్నారు.

First Published:  20 Feb 2023 1:34 PM IST
Next Story