Telugu Global
National

మంగోలియాలో మేఘా దూకుడు.. క్రూడ్ ఆయిల్ రిఫైనరీ నిర్మించబోతున్న MEIL

మంగోలియాలో అత్యాధునిక క్రూడ్ ఆయిల్ రిఫైనరీని MEIL సంస్థ నిర్మించబోతోంది. దీని విలువ రూ.5400 కోట్లు. రిఫైనరీ నిర్మాణ ఒప్పందంపై మంగోల్ రిఫైనరీ, మేఘా ఇంజనీరింగ్ సంస్థల మధ్య మంగోలియా రాజధాని ఉలాన్బాతర్ లో కీలక ఒప్పందం కుదిరింది.

మంగోలియాలో మేఘా దూకుడు.. క్రూడ్ ఆయిల్ రిఫైనరీ నిర్మించబోతున్న MEIL
X

మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్స్ లిమిటెడ్ (MEIL) సంస్థ మంగోలియాలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేపట్టబోతోంది. దీనికి సంబంధించి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తయింది. ఇప్పటికే మంగోలియాలో రెండు కీలక ప్రాజెక్ట్ లను మేఘా సంస్థ చేపట్టింది. ఆ ఒరవడిలో ఇది మూడోది.


మంగోలియాలో అత్యాధునిక క్రూడ్ ఆయిల్ రిఫైనరీని MEIL సంస్థ నిర్మించబోతోంది. దీని విలువ రూ.5400 కోట్లు. రిఫైనరీ నిర్మాణ ఒప్పందంపై మంగోల్ రిఫైనరీ, మేఘా ఇంజనీరింగ్ సంస్థల మధ్య మంగోలియా రాజధాని ఉలాన్బాతర్ లో కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం పై MEIL ఎండీ పీవీ కృష్ణారెడ్డి, మంగోల్ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అల్టాన్ట్సెట్సెగ్ దశ్దవా, MEIL హైడ్రోకార్బన్స్ విభాగం అధ్యక్షుడు పి.రాజేష్ రెడ్డి సంతకాలు చేశారు. ఆయిల్ వెలికితీత, రవాణా, శుద్ధి రంగాల్లో ఇప్పటికే తమ కార్యకలాపాలు విస్తరించిన మేఘా సంస్థ.. ఈ అగ్రిమెంట్ తో రిఫైనరీ నిర్మాణంలోకి కూడా అడుగు పెడుతోంది.

భారత్, మంగోలియా దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలకు మంగోలియా రిఫైనరీ ప్రాజెక్ట్ ఒక ఉదాహరణ అని చెప్పారు మంగోల్ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అల్టాన్ట్సెట్సెగ్ దశ్దవా. రెండు దేశాల మధ్య ఎంతో కాలంగా సత్సంబంధాలు ఉన్నాయని, తమ దేశ అభివృద్ధిలో భారత్ సహకారం ఎంతో కీలకమైనదని చెప్పారు. తమ రిఫైనరీ ప్రాజెక్ట్ రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేస్తుందని అన్నారు MEIL ఎండీ పీవీ కృష్ణారెడ్డి. మంగోలియాలో తొలి గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ నిర్మాణంలో భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఉందన్నారు. నిర్ధేశిత కాల వ్యవధిలో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఈ రిఫైనరీ వల్ల మంగోలియా ఆర్ధికంగా అభివృద్ధి చెందటంతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

మంగోలియాలో మైనస్ 35 డిగ్రీల నుంచి ప్లస్ 40 డిగ్రీల మధ్య.. వాతావరణంలో విపరీతమైన మార్పులుంటాయి. ఈ ప్రతికూల వాతావరణంలో క్రూడ్ ఆయిల్ రిఫైనరీని మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్మించబోతోంది. మంగోలియా దేశంలో ఉపయోగించేందుకు అనువుగా గాసోలిన్, డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్, ఎల్పీజీ తయారీకి ఉపయోగపడే 1. 5 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ ను ఈ ప్రభుత్వ రంగ రిఫైనరీ ఉత్పత్తి చేస్తుంది. AA+ రోబస్ట్ క్రెడిట్ రేటింగ్ ఉన్న MEIL ప్రపంచంలోనే అత్యాధునిక రిగ్గులను తయారు చేసే తొలి ప్రైవేట్ సంస్థ. బెల్జియం, ఇటలీ, చిలీ, అమెరికా లోని హౌస్టన్, తాజాగా తూర్పు మంగోలియాలో తన సేవలను విస్తరిస్తోంది.

First Published:  29 Sept 2023 4:11 PM IST
Next Story