Telugu Global
National

మేఘా ఇంజినీరింగ్ ఘనత.. ఆ హైవేపై 150 కిలోమీటర్ల హై స్పీడ్

ఈ ఎక్స్ ప్రెస్ వే పై గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చని నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) తెలిపింది.

మేఘా ఇంజినీరింగ్ ఘనత.. ఆ హైవేపై 150 కిలోమీటర్ల హై స్పీడ్
X

ముంబై - నాగ్ పూర్ మధ్య నిర్మిస్తున్న సమృద్ధి మహామార్గ్ అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతోంది. ఈ మహామార్గ్ లో ప్యాకేజ్-9 పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసింది. ఈ సమృద్ధి మహామార్గ్ దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్ ప్రెస్ వే గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఎక్స్ ప్రెస్ వే పై గంటకు 150కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చని నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) తెలిపింది. ఈ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభోత్సవం సందర్భంగా MEIL ఎండీ పీవీ కృష్ణారెడ్డి, డైరెక్టర్ సుబ్బయ్య.. మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

మొత్తం 701 కిలోమీటర్ల పొడవున్న ఈ మహామార్గ్ దేశంలోని అతి పొడవైన ఎక్స్ ప్రెస్ వే గా రికార్డు సృష్టించింది. ఇది పూర్తయితే ముంబై, నాగ్ పూర్ మధ్య 16 గంటలుగా ఉన్న ప్రయాణ దూరం 8గంటలకు తగ్గిపోతుంది. ఫేజ్-1లో భాగంగా నాగ్ పూర్ నుంచి షిర్డీ వరకు 520 కిలోమీటర్ల ఎక్స్ ప్రెస్ వే నిర్మించారు ఈ రోజు నుంచి ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. మిగిలిన రోడ్డు నిర్మాణం వచ్చే ఏడాది జులైకి పూర్తవుతుందని చెబుతున్నారు.

నిర్మాణ రంగంలో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్న మేఘా సంస్థ.. ఇప్పుడు అత్యంత ఆధునికమైన హైవే నిర్మాణంతో మరో అరుదైన ఘనత సాధించింది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగేలా హైవే నిర్మించాలంటే మాటలు కాదు. దానికి తగినట్టుగా రోడ్డు నిర్మాణం ఉండాలి. మలుపులు ఎక్కువగా లేకుండా, హైవే మధ్యలో ఎక్కడా క్రాసింగ్ లు లేకుండా నిర్మించాలి. దీనికి తగ్గట్టే అండర్ పాస్ లు వచ్చేట్టుగా హైవే నిర్మించారు. రూ.55వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ హైవే.. మహారాష్ట్రలోని 10 జిల్లాలను కవర్ చేస్తుంది. ఈ ఎక్స్ ప్రెస్ వే ద్వారా మరో 14 జిల్లాలకు కనెక్టివిటీ మెరుగవుతుంది. మొత్తంగా మహారాష్ట్రలోని 24 జిల్లాలకు ఇది మేలు చేస్తుంది. 16 ప్యాకేజీలుగా పని విభజించగా అందులో 9వ ప్యాకేజీ పనులు మేఘా సంస్థకు దక్కాయి.

First Published:  12 Dec 2022 11:14 AM IST
Next Story