9 నెలలు ఆలస్యంగా ఫెలో షిప్ లు అందుకోబోతున్న స్కాలర్లు
స్కాలర్‌షిప్‌ల పంపిణీపై మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ, యూనియన్ గ్రాంట్స్ కమిషన్ (UGC) ల మధ్య వివాదం కారణంగా తొమ్మిది నెలలుగా ఫెలో షిప్ లు లేక ఇబ్బందులు పడుతున్న రీసర్చ్ స్కాలర్స్ కు ఎట్టకేలకు ఫెలో షిప్ లు మంజూరు అయ్యాయి. PMO జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించినట్టు సమాచారం.
ఎట్టకేలకు 9 నెలల తర్వాత M. ఫిల్ మరియు Ph.D. చేస్తున్న రీసెర్చ్ స్కాలర్లకు ఫెలో షిప్ అందనుంది. మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ (MANF) పొందుతున్న రీసెర్చ్ స్కాలర్ల కు తొమ్మిది నెలలకు పైగా స్కాలర్ షిప్ లు అందడంలేదు. చివరికి ప్రధాన మంత్రి కార్యాలయం జోక్యంతో ఈ సమస్యకు ఓ పరిష్కారం లభించింది.
అదేవిధంగా, నేషనల్ ఫెలోషిప్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ (NFPwD), నేషనల్ ఫెలోషిప్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ (NFSC), నేషనల్ ఫెలోషిప్ ఫర్ అదర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ (NFOFC) కింద స్కాలర్ షిప్ పొందుతున్న వాళ్ళకు కూడా ఈ వారం ఫెలో షిప్ లు అందుతాయని అధికారులు తెలిపారు. వీళ్ళకు ఏప్రెల్ నుంచి ఫెలో షిప్ లు ఆగిపోయాయి.
MANF కింద స్కాలర్ షిప్ పొందుతున్న స్కాలర్స్ అందరికీ గురువారంనాడు సొమ్ము అందిందని అధికారులు మీడియాకు తెలిపారు.
స్కాలర్‌షిప్‌ల పంపిణీపై మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ, యూనియన్ గ్రాంట్స్ కమిషన్ (UGC) ల మధ్య వివాదం కారణంగానే ఇంత కాలం ఫెలో షిప్ లు అందలేదని తెలిసింది. PMO జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించినట్టు సమాచారం.
స్కాలర్‌షిప్‌ల పంపిణీపై మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ, యూనియన్ గ్రాంట్స్ కమిషన్ (UGC) ల మధ్య వివాదం కారణంగా తొమ్మిది నెలలుగా ఫెలో షిప్ లు లేక ఇబ్బందులు పడుతున్న రీసర్చ్ స్కాలర్స్ కు ఎట్టకేలకు ఫెలో షిప్ లు మంజూరు అయ్యాయి. PMO జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించినట్టు సమాచారం.9 నెలలుగా ఫెలో షిప్ లు రాక తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని స్కాలర్స్ చెప్పారు. ఈ 9 నెలల కాలం తాము రీసర్చ్ చేయలేక పోయామని , అసలు రోజూ వారీ అవసరాలు తీరడమే కష్టంగా మారిందని స్కాలర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
.
MANF కింద స్కాలర్ షిప్ పొందుతున్న స్కాలర్స్ కు ఫెలో షిప్ అందినప్పటికీ మిగతా వారికి ఇంకా అందాల్సి ఉంది. నేషనల్ ఫెలోషిప్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ (NFSC), నేషనల్ ఫెలోషిప్ ఫర్ అదర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ (NFOBC) కింద పెండింగ్‌లో ఉన్న ఫెలోషిప్‌లను ఒక వారంలోపు అందజేస్తామని సామాజిక న్యాయం, సాధికారత విభాగం కార్యదర్శి ఆర్. సుబ్రహ్మణ్యం గురువారం తెలిపారు.
ఇక 2020-2021లో వికలాంగుల కోటాలో నేషనల్ ఫెలోషిప్ కోసం ఎంపికైన ఒక స్కాలర్, తాను, మరొక స్కాలర్ మాత్రం తమ స్కాలర్ షిప్ లోని కొంత భాగం పొందామని, మిగతాది ఎప్పుడు వస్తుందో తెలియదన్నారు. మిగతావాళ్ళకు అది కూడా వచ్చిందా లేదా అన్నది తనకు స్పష్టంగా తెలియదని చెప్పారు.