ఒకే కుటుంబంలో ఏడుగురు ఆత్మహత్య.. కారణమేంటంటే..
మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సామూహిక సూసైడ్‌కు కారణం ఏమిటన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
గుజరాత్‌లోని సూరత్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడు మంది ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. మరణించినవారిలో ముగ్గురు పిల్లలు ఉండటం మరింత విషాదకరం.
అడాజన్ ప్రాంతంలోని సిద్ధేశ్వర్ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి అందులో నివసిస్తున్న కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. అక్కడే ఉన్న సూసైడ్ నోట్, విషం బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మృతులను మనీష్ సోలంకి, భార్య రీటా, పిల్లలు దిశ, కావ్య, ఖుషాల్, మనీష్ తల్లిదండ్రులైన కాంతిలాల్ సోలంకి, శోభనగా గుర్తించారు. సూరత్‌లోని పాలన్ పూర్ జకత్నాక్ రోడ్డులో ఫర్నిచర్ వ్యాపారం చేసే మనీష్ సోలంకి ఆర్థిక సమస్యలు రావటంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు విషం ఇచ్చిన తరువాత మనీష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సామూహిక సూసైడ్‌కు కారణం ఏమిటన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.