Telugu Global
National

మణిపూర్ మంట.. ప్రత్యేక రాష్ట్రం కావాలంట

రాజకీయ లాభం కోసం మణిపూర్ లో అధికార బీజేపీ రిజర్వేషన్ చిచ్చు పెట్టింది. అదిప్పుడు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ వరకు వచ్చి చేరింది.

మణిపూర్ మంట.. ప్రత్యేక రాష్ట్రం కావాలంట
X

గిరిజనేతరులకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించడంతో మణిపూర్ రాష్ట్రంలో మొదలైన మంట ఇప్పుడు మరో కొత్తరూపు సంతరించుకుంది. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు కుకి గిరిజనులు. కుకి గిరిజన తెగ ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కోరుతూ వారి ప్రాబల్యం ఎక్కువ ఉన్న ప్రాంతాల ఎమ్మెల్యేలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కి లేఖ రాశారు. వీరిలో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉండటం విశేషం.

మణిపూర్ లో మైతై తెగకు ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వడంతో అసలు గొడవ మొదలైంది. అప్పటికే ఎస్టీ రిజర్వేషన్లు ఉన్న గిరిజన తెగలు బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి, నిరసనలకు దిగాయి, అల్లర్లు చెలరేగడంతో వారం రోజులపాటు మణిపూర్ అట్టుడికింది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా భయపడి సొంత ఊళ్లకు తిరిగొచ్చారు. తిరిగి అక్కడ పరిస్థితి సద్దుమణుగుతుంది అనుకుంటున్న టైమ్ లో ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ ఊపందుకుంది.

కుకి గిరిజనులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక పాలన కిందకు తీసుకురావాలని, దీనికి రాష్ట్ర హోదా కల్పించాలని, ‘ప్రత్యేక పాలనా ప్రాంతం’గా ప్రకటించాలన్న డిమాండ్‌ ఊపందుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌ ఈ డిమాండ్‌ ను తిరస్కరించిన కొద్దిగంటల్లోనే, 10 మంది ఎమ్మెల్యేలు నిరసన గళం వినిపించారు. గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాలని కోరుతూ 10మంది ఎమ్మెల్యేలు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. లేఖ రాసిన వారిలో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. రాజకీయ లాభం కోసం మణిపూర్ లో అధికార బీజేపీ రిజర్వేషన్ చిచ్చు పెట్టింది. అదిప్పుడు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ వరకు వచ్చి చేరింది.

First Published:  17 May 2023 11:04 AM IST
Next Story