ఎమ్మెల్యేల అభిప్రాయాలకు అనుగుణంగానే సీఎం అభ్యర్థి ఎంపిక - కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడి
కర్నాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ అధిష్టానం ముగ్గురు పరిశీలకులను పంపిందని ఖర్గే తెలిపారు. వారు ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించి అధిష్టానానికి అందజేస్తారని వివరించారు.
కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక ఎమ్మెల్యేల అభిప్రాయాలకు అనుగుణంగానే జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. బెంగళూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్నాటక సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేశారు.
కర్నాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ అధిష్టానం ముగ్గురు పరిశీలకులను పంపిందని ఖర్గే తెలిపారు. వారు ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించి అధిష్టానానికి అందజేస్తారని వివరించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకునేందుకు సీఎల్పీ భేటికి వచ్చిన పరిశీలకులతో సోమవారం నాడు సోనియా, రాహుల్ భేటీ అవుతారని వెల్లడించారు. ఈ సందర్భంగా పరిశీలకులు తాము సేకరించిన వివరాలు వారికి నివేదిస్తారని ఖర్గే వివరించారు.
పరిశీలకుల నుంచి సేకరించిన వివరాలను తెలుసుకున్న అనంతరం రెండు మూడు రోజుల వ్యవధిలో సీఎం అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశముందని ఖర్గే తెలిపారు.