Telugu Global
National

మోడీ విజిట్‌.. లక్షద్వీప్‌కు అమాంతం పెరిగిన క్రేజ్‌

ప్రధాని మోడీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. మోడీ పర్యటనపై మాల్దీవ్స్‌కు చెందిన పలువురు మంత్రులు వివాదాస్పద కామెంట్స్ చేశారు.

మోడీ విజిట్‌.. లక్షద్వీప్‌కు అమాంతం పెరిగిన క్రేజ్‌
X

ప్రధాని మోడీ పర్యటన, మాల్దీవ్స్‌ మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత లక్షద్వీప్‌కు క్రేజ్‌ అమాంతం పెరిగింది. ప్రధానంగా మోడీ పర్యటన లక్షద్వీప్‌లో పర్యాటకానికి ఊతమిచ్చినట్లయిందని ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ మేక్‌ మై ట్రిప్ స్పష్టం చేసింది. తన ప్లాట్‌ఫామ్‌లో ఈ కేంద్ర పాలిత ప్రాంతం కోసం సెర్చ్‌ చేస్తున్న వారి శాతం ఏకంగా 3,400కు పెరిగిందని తెలిపింది.

ప్రధాని మోడీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. మోడీ పర్యటనపై మాల్దీవ్స్‌కు చెందిన పలువురు మంత్రులు వివాదాస్పద కామెంట్స్ చేశారు. లక్షద్వీప్‌ మాల్దీవులతో పోటీ పడలేదంటూ తక్కువ చేసి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య వివాదానికి దారి తీశాయి. ఈ వ్యాఖ్యలపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు సోషల్‌మీడియాలోనూ బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్ అయ్యింది. బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఇందుకు మద్దతు తెలిపారు. చాలా మంది భారతీయులు మాల్దీవ్స్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో గత్యంతరం లేక మాల్దీవ్స్ సర్కార్ దిగివచ్చింది. వివాదాస్పద కామెంట్స్ చేసిన ముగ్గురు మంత్రులపై వేటు వేసింది.



మరో ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ ఈజ్‌ మై ట్రిప్‌ వ్యవస్థాపకుడు నిషాంత్ పిట్టి సైతం ఇండియాకు సంఘీభావం ప్రకటించారు. ఇందులో భాగంగా మాల్దీవ్స్‌కు అన్ని రకాల ఫ్లైట్ బుకింగ్స్‌లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు నిషాంత్ పిట్టి ట్వీట్ చేశారు.

First Published:  8 Jan 2024 7:55 PM IST
Next Story