సెక్స్ వర్కర్ల సంఖ్యలో మహారాష్ట్ర టాప్.. ఏపీకి మరో రికార్డ్
స్థానిక సెక్స్ వర్కర్ల సంఖ్యలో దేశంలోనే ఏపీ నెంబర్-1 స్థానంలో ఉంది. ఏపీలో స్థానిక సెక్స్ వర్కర్లు 1.33 లక్షలమంది ఉన్నారు.
భారత్ లో హెచ్ఐవీ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా అసలు ఏ రాష్ట్రంలో ఎంతమంది సెక్స్ వర్కర్లు ఉన్నారు..? వారిలో వలస వచ్చినవారు ఎంతమంది..? స్థానికులు ఎవరు..? అనే లెక్కలు తీస్తోంది కేంద్రం. తాజాగా దీనికి సంబంధించిన గణాంకాలు విడుదల చేసింది. ఈ లెక్కల్లో ఒక కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉండటం విశేషం. స్థానిక సెక్స్ వర్కర్ల సంఖ్యలో దేశంలోనే ఏపీ నెంబర్-1 స్థానంలో ఉంది. ఏపీలో స్థానిక సెక్స్ వర్కర్లు 1.33 లక్షలమంది ఉన్నారు.
మహారాష్ట్ర నెంబర్-1
ఇక దేశవ్యాప్తంగా సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర నెంబర్-1 స్థానంలో ఉంది. అయితే వీరిలో వలస వచ్చినవారి సంఖ్యే ఎక్కువ కావడం విశేషం. మహారాష్ట్రలో మొత్తం 6.6 లక్షల మంది పడుపు వృత్తిని జీవనాధారంగా కొనసాగిస్తున్నారు. మహారాష్ట్ర తర్వాత, 2.3 లక్షల మంది సెక్స్ వర్కర్లతో గుజరాత్ రెండో స్థానంలో ఉంది. ఈ సంఖ్యలో ఢిల్లీది మూడో స్థానం. జీవనోపాధి కోసం చాలామంది ఉత్తరాదికి వలస వెళ్తున్నారని, అక్కడ అనుకోని పరిస్థితుల్లో సెక్స్ వర్కర్లుగా మారిపోతున్నారని తేలింది. టీనేజ్ అమ్మాయిలను తరలించే రాష్ట్రాల్లో ఏపీ టాప్ ప్లేస్ లో ఉండటం విశేషం.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తరపున జరిగిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. వలస వచ్చిన వారు, స్థానికులు.. ఇలా విడివిడిగా వివరాలు సేకరించారు. స్థానికులతోపాటు వలస వచ్చినవారిని కూడా కలుపుకుంటే ఆ సంఖ్యలో మహారాష్ట్ర నెంబర్ -1 స్థానంలో ఉంది. కేవలం స్థానికులనే పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఏపీ అందులో టాప్. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏపీ మూలాలున్న సెక్స్ వర్కర్లు ఉన్నారని ఈ సర్వే తేల్చింది. అయితే ఈ లెక్కల్లో లేనివారు ఇంకా చాలామందే ఉంటారని అంచనా.