Telugu Global
National

మధ్యప్రదేశ్ లో పోలింగ్ ప్రారంభం.. చత్తీస్ ఘడ్ రెండో దశ కూడా

ఛత్తీస్‌ ఘడ్ లో నవంబర్‌ 7న తొలి దశలో 20 స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఈరోజు రెండోదశతో అక్కడ పోలింగ్ పూర్తవుతుంది. మధ్యప్రదేశ్ లో మాత్రం సింగిల్ ఫేజ్ లో ఈరోజు ఎన్నికలు పూర్తవుతాయి.

మధ్యప్రదేశ్ లో పోలింగ్ ప్రారంభం.. చత్తీస్ ఘడ్ రెండో దశ కూడా
X

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది. ఈరోజు మధ్యప్రదేశ్‌ లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. అటు చత్తీస్ ఘడ్ లో మిగిలిన 70 నియోజకవర్గాల్లో కూడా ఈరోజే పోలింగ్ జరుగుతోంది. ఛత్తీస్‌ ఘడ్ లో నవంబర్‌ 7న తొలి దశలో 20 స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఈరోజు రెండోదశతో అక్కడ పోలింగ్ పూర్తవుతుంది. మధ్యప్రదేశ్ లో మాత్రం సింగిల్ ఫేజ్ లో ఈరోజు ఎన్నికలు పూర్తవుతాయి.


కర్నాటక హిస్టరీ రిపీటవుతుందా..?

కర్నాటకలో కాంగ్రెస్ ని అధికారంలోనుంచి కూలదోసి బీజేపీ గద్దెనెక్కింది. గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కి పూర్తిస్థాయి మెజార్టీ ఇచ్చి హంగ్ కి ఛాన్స్ లేకుండా చేశారు. బీజేపీకి బుద్ధి చెప్పారు. మధ్యప్రదేశ్ లో కూడా 2018 ఎన్నికల తర్వాత అదే జరిగింది. 230 స్థానాల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌ 114 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జ్యోతిరాదిత్య సింధియాని తమవైపు లాక్కొని బీజేపీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం అయ్యారు. ఇక్కడ కూడా ప్రజలు ఈసారి బీజేపీకి బుద్ధి చెప్పి హంగ్ లేకుండా కాంగ్రెస్ కే మెజార్టీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి ఓటరు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.


ఛత్తీస్‌ ఘడ్ లో..

15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర దించి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 68 సీట్లతో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది. సీఎం భూపేష్ బఘేల్ ని మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తారనే ప్రచారం బలంగా జరుగుతోంది. ఉప ఎన్నికల విజయాలతో కలుపుకొని అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలం 71 సీట్లు. 90 సీట్లలో 71 సీట్ల మెజార్టీ అంటే మాటలు కాదు. మరి ఆ మెజార్టీని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.

First Published:  17 Nov 2023 9:38 AM IST
Next Story