అక్కడ ఇక్కడ కాదు.. ఏటీఎం బూత్ లో రొమాన్స్
లోపలికి వెళ్లిన జంట ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి లోపలికి తొంగి చూశాడు. ఏటీఎం మిషన్ తో ట్రాన్సాక్షన్ మానేసి, ఒకరితో ఒకరు రొమాన్స్ చేసుకుంటున్నారు. చివరకు వారు పోలీసులకు చిక్కారు.
ఓయో రూమ్ లు, పార్క్ లు, ఇవేవీ చాలదన్నట్టు ఇప్పుడు ప్రేమికులు ఏటీఎం సెంటర్లని కూడా తమ ప్రైవేట్ కార్యకలాపాలకు వాడేసుకుంటున్నారు. గంటన్నరసేపయినా ఏటీఎంలోకి వెళ్లిన యువజంట బయటకు రాలేదేంటా అని లోపలికి సెక్యూరిటీ గార్డ్ తొంగి చూడగా అసలు విషయం బయటపడింది. రొమాన్స్ చేసుకుంటున్న వారిద్దరికీ సెక్యూరిటీ చీవాట్లు పెట్టి బయటకు పంపించాడు. అప్పటికే అక్కడ పోలీస్ వ్యాన్ పెట్రోలింగ్ కి రావడంతో వారికి అప్పగించారు. వారిద్దరూ మెడికల్ స్టూడెంట్స్ అని తేలింది. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో జరిగింది.
పాట్నాలో ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ రాత్రి పొద్దుపోయిన తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలోకి వెళ్లారు. ఆ ఏటీఎం బయట సెక్యూరిటీ గార్డ్ కాపలాగా ఉన్నాడు. రాత్రి కావడంతో ఆతను ఏటీఎం బయటే కూర్చుని ఉన్నాడు. లోపలికి వెళ్లిన జంట ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి లోపలికి తొంగి చూశాడు. ఏటీఎం మిషన్ తో ట్రాన్సాక్షన్ మానేసి, ఒకరితో ఒకరు రొమాన్స్ చేసుకుంటున్నారు. చివరకు వారు పోలీసులకు చిక్కారు.
కక్కుర్తి పడ్డారో లేక, ఏటీఎంలో సీసీ కెమెరాలు ఉన్నా పర్లేదనుకున్నారో కానీ వారిద్దరూ ప్రేమ ఊసులు చెప్పుకోడానికి ఏటీఎంని మించిన ప్లేస్ లేదని డిసైడ్ అయ్యారు. హాయిగా ఏసీలో కాలక్షేపం చేద్దామనుకున్నారు. పోలీసులు మాత్రం ఆ ప్రేమికుల్ని దొంగలుగా అనుమానించి విచారణ చేపట్టారు. అదుపులోకి తీసుకున్నారు. గంటన్నర సేపు లోపల ఏంచేశారని ప్రశ్నించారు. చివరకు వారిద్దరూ మెడికల్ స్టూడెంట్స్ అని తేలింది. వారిద్దరూ ప్రేమికులని పోలీసులు గుర్తించారు.