మీకు తెలుసా ? మెస్సీ భారతీయుడట ! ఓ ఎంపీ గారి ఉవాచ!
అస్సాంలోని బార్‌పేట నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖలేక్ 'మెస్సీ' గురించి ఓ ట్వీట్ చేశాడు. అందులో ''మెస్సీ మీకు హృదయపూర్వక అభినందనలు. మీకు అస్సాంకు ఉన్న కనెక్షన్ వల్ల మేము గర్విస్తున్నాము. ”అని అన్నాడు
ప్రపంచంలో ఎక్కడేం జరిగినా దానికి నేనే కారణమనే నాయకులను చూస్తున్నాం.... ఎవరు గొప్ప పని చేసినా వాళ్ళు మా వాళ్ళే అనే నాయకులనూ , వారి అనుచరుల ప్రచారాలనూ చూస్తున్నాం..... ఎవరేం కనిపెట్టినా అది మావాళ్ళు ఎప్పుడో వేల ఏళ్ళ క్రితమే కనిపెట్టారనే అతి గాళ్ళనూ చూస్తున్నాం.... అలాంటి కేటగిరీలోకి ఇప్పుడో కాంగ్రెస్ ఎంపీ చేరిపోయాడు.
ఫుట్ బాల్ ప్రపంచ కప్ లో ఫ్రాన్స్ పై గెలిచి విజేతగా నిల్చిన అర్జెంటీనా జట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సీని ప్రపంచమంతా అభినందనలతో ముంచెత్తుతోంది. అందరూ ఆయన ఆట తీరును పొగుడుతూ ఉంటే సందెట్లో సడేమియాలా మన దేశానికి చెందిన ఓ కాంగ్రెస్ ఎంపీ గారు మెస్సి మావాడే అని ప్రకటించేశాడు.
అస్సాంలోని బార్‌పేట నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖలేక్ 'మెస్సీ' గురించి ఓ ట్వీట్ చేశాడు. అందులో ''మెస్సీ మీకు హృదయపూర్వక అభినందనలు. మీకు అస్సాంకు ఉన్న కనెక్షన్ వల్ల మేము గర్విస్తున్నాము. "అని అన్నాడు.
మెస్సీకి అస్సాంతో కనెక్షనా అదెలా ? అని ఆదిత్య శర్మ అనే ట్విట్టర్ యూజర్ ప్రశ్నించగా, "అవును, అతను అస్సాంలో పుట్టాడు" అని ఎంపీ అబ్దుల్ ఖలేక్ జవాబు చెప్పాడు. ఈ ఎంపీ ట్వీట్లపై ట్విట్టర్ లో నెటిజనులు విపరీతం గాస్పందించారు. ఆయనను అపహాస్యం చేస్తూ, వ్యంగ్యంగా ట్వీట్లు చేశారు.
"అవును సార్, అతను నా క్లాస్‌మేట్," అని ఒక ట్విట్టర్ యూజర్ కామెంట్ చేగాగ, మరో యూజర్ ''అవును నిజమే అందుకే ప్రపంచ కప్ అయిపోగానే మెస్సీ, అతని భార్య అస్సాంను సందర్శించారు.'' అని వ్యగ్యంగా స్పందించారు.
మరో ట్విట్టర్ యూజర్ మెస్సీ చిత్రాన్ని పోస్ట్ చేస్తూ, "నేను అస్సాంలో పుట్టానని ఈ రోజు తెలుసుకున్నాను" అని క్యాప్షన్ ఇచ్చాడు.
ఇన్ని అవహేళనల తర్వాత ఆ ఎంపీ తన ట్వీట్లను తొలగించారు.
Yes sir he was my classmate
— V. (@immaturelyyours) December 19, 2022
After the world cup messi and his wife visited assam
— Desi Bhayo (@desi_bhayo88) December 19, 2022
Never forget where you come from pic.twitter.com/lw6SmMmFXe