తల్లికి రెండో పెళ్లి.. - గొప్ప మనసు చాటుకున్న కుమారుడు
సమాజమంతా దూషించినా అతను లెక్కచేయలేదు.. స్నేహితులు, బంధువుల సాయంతో పెళ్లి కొడుకు కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ ప్రయత్నంలో మారుతి అనే వ్యక్తి తన తల్లికి సరైన వ్యక్తి అని భావించాడు.
పెళ్లయిన కొద్దికాలానికే భర్తను కోల్పోయినా.. కొడుకును కంటికి రెప్పలా కాచుకుంటూ పెంచింది ఆ తల్లి. భర్తను కోల్పోయిన నాటినుంచి కొడుకే తన జీవితంగా భావిస్తూ ఒంటరిగానే జీవిస్తోంది. 23 ఏళ్ల కుమారుడు యువరాజ్ షేలే తన తల్లి ఒంటరి తనాన్ని చూసి.. తట్టుకోలేకపోయాడు. పొరుగువారితో కూడా ఎలాంటి సంబంధాలూ లేకుండా ఒంటరిగా ఉండటం అతని మనసును కలచివేసింది.
తల్లి బాధను ఎలా తొలగించాలా అని సుదీర్ఘంగా ఆలోచించిన అతనికి ఆమెకు ఓ తోడును అందిస్తేనే అది సాధ్యమవుతుందని భావించాడు. రెండో పెళ్లే అందుకు సరైన పరిష్కారమనుకున్నాడు. తనను చిన్న నాటి నుంచి ఏ లోటూ లేకుండా పెంచిన తల్లికి కానుకగా ఓ తోడును అందించాలనుకున్నాడు.
సమాజమంతా దూషించినా అతను లెక్కచేయలేదు.. స్నేహితులు, బంధువుల సాయంతో పెళ్లి కొడుకు కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ ప్రయత్నంలో మారుతి అనే వ్యక్తి తన తల్లికి సరైన వ్యక్తి అని భావించాడు. తల్లితో చర్చించిన అనంతరం వారిద్దరికీ వివాహం జరిపించాడు. ఈ ఉదంతంపై పలువురు రకరకాలుగా కామెంట్లు చేసినా.. అనేకమంది అతని గొప్ప మనసును అభినందిస్తున్నారు.