మోడీపై చేసిన ట్వీట్‌పై సిగ్గుపడటం లేదు.. ఖుష్బూ వ్యాఖ్యలు
ఈ వ్యవహారంపై తాజాగా ఖుష్బూ స్పందించింది. ఓ ట్వీట్ చేసింది. 'మోడీపై నేను చేసిన ట్వీట్‌పై సిగ్గుపడటం లేదు. డిలీట్ కుడా చేయను. అప్పుడు నేను పార్టీ నాయకుడిని, మాట్లాడే భాషను మాత్రమే అనుసరించా ' అని ట్వీట్ చేసింది.
ప్రధాని మోడీపై తాను చేసిన ట్వీట్‌పై సిగ్గు పడటం లేదని, ఆ ట్వీట్‌ను డిలీట్ కూడా చేయనని సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ పేర్కొన్నారు. అప్పట్లో తాను తమ పార్టీ నాయకుడిని, ఆయన మాట్లాడే భాషను అనుసరించానని.. అందువల్లే మోడీపై అటువంటి వ్యాఖ్యలు చేసినట్లు వివరించింది. మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించింది.
మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్‌పై చర్యలు తీసుకుంటే మరి ఖుష్బూపై ఎందుకు తీసుకోవడం లేదని.. ఆమె కూడా మోడీపై అభ్యంతర వ్యాఖ్యలు చేసింది కదా.. అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉండటంవల్లే చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. 2018లో ఖుష్బూ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు మోడీపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసింది. ప్రతి మోడీ వెనుక అవినీతి అనే పేరు ఇంటి పేరు పెట్టాలని, మోడీ పేరుని అవినీతిగా మార్చేద్దాం.. అని ఖుష్బూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌ని కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తాజాగా ఖుష్బూ స్పందించింది. ఓ ట్వీట్ చేసింది. 'మోడీపై నేను చేసిన ట్వీట్‌పై సిగ్గుపడటం లేదు. డిలీట్ కుడా చేయను. అప్పుడు నేను పార్టీ నాయకుడిని, మాట్లాడే భాషను మాత్రమే అనుసరించా ' అని ట్వీట్ చేసింది. ఖుష్బూ చేసిన ట్వీట్‌ని చూస్తే ఆమె తాను ఏ తప్పు చేయలేదని.. జస్ట్ తమ పార్టీ నాయకుడిని ఫాలో అయ్యా అన్నట్లుగా ఉంది. వివాదం నుంచి తప్పించుకునే విధంగా ఖుష్బూ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.