ఆరుబయట ఆడుకోనివ్వండి.. అమ్మ చేతివంట పెట్టండి
సరైన పర్యవేక్షణ లేకుండా మైనర్లకు మొబైల్ ఫోన్లు ఇవ్వటం వల్ల కలిగే ప్రమాదాల గురించి పిల్లల తల్లిదండ్రులను కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.కున్హీ కృష్ణన్ హెచ్చరించారు.
BY Telugu Global14 Sept 2023 8:26 AM IST
X
Telugu Global Updated On: 14 Sept 2023 11:56 AM IST
పిల్లలను ఆరుబయట ఆడుకోనివ్వాలని, అమ్మ వండిన రుచికరమైన ఆహారాన్ని వారికి అందించాలని కేరళ హైకోర్టు సూచించింది. ఓ కేసు విచారణలో భాగంగా అమ్మ చేతివంట ప్రాముఖ్యతను న్యాయస్థానం అందరికీ గుర్తుచేసింది. రెస్టారెంట్ల నుంచి ఆన్‌లైన్ ఫుడ్ కొనుగోలు చేసే బదులు.. తల్లి చేతి వంట పిల్లలకు పెట్టడం ద్వారా వారు ఆరోగ్యంగా ఉంటారని తెలిపింది.
సరైన పర్యవేక్షణ లేకుండా మైనర్లకు మొబైల్ ఫోన్లు ఇవ్వటం వల్ల కలిగే ప్రమాదాల గురించి పిల్లల తల్లిదండ్రులను కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.కున్హీ కృష్ణన్ హెచ్చరించారు. ఇంటర్‌నెట్ సదుపాయం ఉన్న మొబైల్ ఫోన్ల ద్వారా అశ్లీల వీడియోలు సులభంగా చూడవచ్చని, పిల్లలు దీని బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అశ్లీల చిత్రాల వీక్షణకు సంబంధించిన కేసు విచారణలో న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story