Telugu Global
National

కేర‌ళ సీపీఎంకు.. త్రిసూర్ జిల్లాలో 80 సీక్రెట్ బ్యాంకు అకౌంట్లు, 100 స్థిరాస్తులు

మ‌రోవైపు ఒక్క త్రిసూర్ జిల్లాలోనే పార్టీ కార్యాలయాల పేరుతో 100 స్థిరాస్తులు సీపీఎంకు ఉన్నాయి. వీటిని కూడా ఆ పార్టీ వెల్లడించలేదు. ఈ బ్యాంకు ఖాతాలు, స్థిరాస్తులను పార్టీ కార్యకలాపాల కోసం సీపీఎం వాడుకుంటోంది.

కేర‌ళ సీపీఎంకు.. త్రిసూర్ జిల్లాలో 80 సీక్రెట్ బ్యాంకు అకౌంట్లు, 100 స్థిరాస్తులు
X

కేరళలో అధికార పార్టీ సీపీఎంకు భారీ ఎత్తున ర‌హ‌స్య ఆస్తులున్న‌ట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. ఒక్క త్రిసూర్ జిల్లాలోనే 80 సీక్రెట్ బ్యాంక్ అకౌంట్లు, 100 స్థిరాస్తులు ఉన్నాయ‌ని ఎన్నిక‌ల సంఘానికి నివేదించింది. ఓ మనీలాండరింగ్ కేసులో ద‌ర్యాప్తు చేస్తుండ‌గా వీటిని కనుగొన్నామని పేర్కొంది. ఈడీ అందించిన ఈ బ్యాంక్‌ ఖాతాలు, స్థిరాస్తులపై విచారణ జరపాలని కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల విభాగం (సీబీడీటీ)కి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

వాటిలో రూ.25 కోట్ల డిపాజిట్లు

త్రిసూర్ కేంద్రంగా పనిచేసే కరువన్నూర్ సర్వీస్ కో-ఆపరేటివ్ బ్యాంకుతోపాటు కేరళ సీపీఎం ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఏసీ మొయిదీనన్ను విచారించిన సందర్భంగా ఈ వివరాలు వెల్లడయ్యాయని ఈడీ బుధ‌వారం ప్ర‌క‌టించింది. ఇలా ఈసీకి చెప్ప‌కుండా ర‌హ‌స్యంగా ఉంచిన బ్యాంకు అకౌంట్ల‌లో సీపీఎంకు రూ.25 కోట్ల డిపాజిట్లున్నాయి. ఈ డిపాజిట్లలో అధిక భాగాన్ని న‌గ‌దు రూపంలో విత్‌డ్రా చేశారు.

మ‌రోవైపు ఒక్క త్రిసూర్ జిల్లాలోనే పార్టీ కార్యాలయాల పేరుతో 100 స్థిరాస్తులు సీపీఎంకు ఉన్నాయి. వీటిని కూడా ఆ పార్టీ వెల్లడించలేదు. ఈ బ్యాంకు ఖాతాలు, స్థిరాస్తులను పార్టీ కార్యకలాపాల కోసం సీపీఎం వాడుకుంటోంది. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఈ వివరాలను ఎన్నికల సంఘానికి, ఆదాయ పన్నుశాఖకు వెల్ల‌డించాలి. సీపీఎం అలా తెలియ‌చేయ‌క‌పోవ‌డంతో ఈడీ ఇప్పుడు ఈసీకి నివేదిక ఇచ్చింది. ఒక్క త్రిసూర్ జిల్లాలోనే ఇన్ని ర‌హ‌స్య ఆస్తులుంటే కేర‌ళ వ్యాప్తంగా ఇంకెన్ని ఉంటాయ‌నే చ‌ర్చ కేర‌ళ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

First Published:  11 April 2024 10:59 AM IST
Next Story