Telugu Global
National

ఆ 3 పుస్తకాలు చదువుకుంటా.. కోర్టుకు కేజ్రీవాల్ విజ్ఞప్తి

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గతనెల 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది.

ఆ 3 పుస్తకాలు చదువుకుంటా.. కోర్టుకు కేజ్రీవాల్ విజ్ఞప్తి
X

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 15 వ‌ర‌కు జుడీషియ‌ల్ క‌స్టడీకి పంపింది. ఈ నేపథ్యంలో అర‌వింద్ కేజ్రీవాల్ కోర్టులో ప్రత్యేక అప్లికేష‌న్ వేశారు. 3 పుస్తకాలు చ‌దువుకునేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోర్టును కోరారు. భ‌గ‌వ‌ద్గీత, రామాయ‌ణం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్.. పుస్తకాలు కేజ్రీవాల్ చ‌దువుకుంటార‌ని ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదులు కోర్టులో తెలిపారు.

ప్రస్తుతం జుడీషియ‌ల్ రిమాండ్‌కు వెళ్లిన కేజ్రీవాల్ మ‌రో 15 రోజుల పాటు తీహార్‌ జైల్లోనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే తనకు ఏమేం కావాలి అనే వాటిని కేజ్రీవాల్ తన తరఫు లాయర్ ద్వారా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. పుస్తకాలతోపాటు ఒక టేబుల్, చైర్, మెడిసిన్స్‌, డైట్‌ ప్రకారం ఆహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తన మెడలో ప్రస్తుతం ఉన్న లాకెట్‌ను కొనసాగించేందుకు అనుమతించాలని కోరారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గతనెల 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత తిరిగి కోర్టులో హాజరపరచగా ఈడీ కస్టడీని ఏప్రిల్ 1 వరకు పొడిగించింది. తాజాగా మళ్లీ కోర్టులో హాజరుపరచగా.. ఈ నెల15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు పంపించారు. ఈ నేపథ్యంలోనే జైల్లో పుస్తకాలు చదివేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టుకు స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు కేజ్రీవాల్.

First Published:  1 April 2024 9:31 PM IST
Next Story