Telugu Global
National

ఈ రోజు విచారణకు హాజరుకాలేనని ఈడీకి లేఖ రాసిన కవిత‌

కవిత లేఖపై ఈడీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని బీఆరెస్ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది భరత్ మీడియాతో చెప్పారు. మహిళను ఇంట్లోనే విచారించాలని, అది మహిళల హక్కు అని ఆయన అన్నారు. ఈ విషయంపై సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని ఆయన తెలిపారు.

ఈ రోజు విచారణకు హాజరుకాలేనని ఈడీకి లేఖ రాసిన కవిత‌
X

తాను సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్ లో ఉన్నందువల్ల ఈ రోజు విచారణకు హాజరుకాలేనని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ పంపారు. ఆమె రాసిన లేఖను న్యాయవాదులు ఈడీ ఆఫీస్ లో అందజేశారు. వాస్త‌వానికి ఈ రోజు ఉదయం 11 గంటలకు కవిత ఈడీ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంది.

.

ఈ లోపు ఈడీ కొంత సమాచారం కోరడంతో ఆమె బీఆరెస్ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది సోమా భరత్ ద్వారా ఈడీకి కావాల్సిన సమాచార‍ంతో పాటు తాను రాసిన లేఖను పంపించారు.

దీనికి ముందు కవిత న్యాయనిపుణులతో చర్చలు జరిపారు. కాగా ఈడీ కార్యాలయానికి వెళ్ళే ముందు కవిత మీడియాతో మాట్లాడుతారని ఆమె ప్రతినిధులు సమాచారం ఇచ్చారు. కానీ కవిత మీడియాతో మాట్లాడలేదు.

అయితే కవిత లేఖపై ఈడీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని భరత్ మీడియాతో చెప్పారు. మహిళను ఇంట్లోనే విచారించాలని అది మహిళల హక్కు అని ఆయన అన్నారు. ఈ విషయంపై సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని ఆయన తెలిపారు.

First Published:  16 March 2023 7:20 AM GMT
Next Story