కౌరవులు ఖాకీ నెక్కర్లతో తిరుగుతున్నారు -రాహుల్ గాంధీ
"21వ శతాబ్దానికి చెందిన కౌరవులు ఖాకీ నెక్కర్లు ధరిస్తారు. వారు చేతుల్లో లాఠీలు (కర్రలు) పట్టుకుని శాఖలలో పాల్గొంటారు" అని రాహుల్ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌పై మండిపడ్డారు.
ఆరెస్సెస్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో సారి విరుచుకపడ్డారు. వాళ్ళను కౌరవులుగా ఆయన అభివర్ణించారు.
హిందూ పురాణ గాథ మహాభారత యుద్దం జరిగిందని చెప్పబడుతున్న కురుక్షేత్రాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ తన పార్టీని కౌరవులకు వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాడిన "పాండవులు"తో పోల్చారు. "పాండవులు తపస్వి (సన్యాసులు) వారు 'మొహబ్బత్ కి దుకాన్' (ప్రేమ దుకాణం) కూడా నడిపారు," అని ఆయన అన్నారు. తన భారత్ జోడో యాత్ర ద్వేషానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందని రాహుల్ అన్నారు.
"21వ శతాబ్దానికి చెందిన కౌరవులు ఖాకీ నెక్కర్లు ధరిస్తారు. వారు చేతుల్లో లాఠీలు (కర్రలు) పట్టుకుని శాఖలలో పాల్గొంటారు" అని రాహుల్ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌పై మండిపడ్డారు. " దేశంలోని అత్యంత సంపన్నులు కూడా వారితో కలిసి ఉన్నారు. నోట్ల రద్దు, GST (వస్తువులు, సేవల పన్ను)తో ఎవరు, ఏమి లాభపడ్డారో దయచేసి అర్థం చేసుకోండి. ఈ విధానాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకొచ్చి ఉండవచ్చు, కానీ ఈ చర్య వెనుక బిలియనీర్లున్నారు.”అని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఉత్తర భారతదేశంలో చలికాలంలో టీ-షర్టు ధరించి యాత్ర చేస్తున్నందుకు తనను లక్ష్యంగా చేసుకున్న వారిపై కూడా రాహుల్ మండి పడ్డారు.
''బీజేపీకి 'తపస్సు' పట్ల గౌరవం ఉండదు. వారి 'పూజ' (పూజలు) చేసేవారిని మాత్రమే గౌరవించాలని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు చెబుతున్నాయి. ''
"ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తులు ఎప్పుడూ 'హర్ హర్ మహాదేవ్' అని జపించరు, ఎందుకంటే శివుడు 'తపస్వి' ఈ వ్యక్తులు భారతదేశంలోని తపస్విలపై దాడి చేస్తున్నారు. వారు 'జై సియారామ్' నుండి సీతాదేవిని తొలగించారు. ఈ వ్యక్తులు భారతదేశ సంస్కృతికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అని రాహుల్ ధ్వజమెత్తారు.