మైనర్లకు కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలను అమ్మొచ్చట!
మైనర్‌లకు కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలను విక్రయించడాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించిందని మీడియా నివేదికల నేపథ్యంలో, మైనర్లకు మాత్రలు, కండోమ్‌లను విక్రయించడంపై రాష్ట్రంలో ఎటువంటి నిషేధం లేదని రాష్ట్ర ప్రభుత్వ ఔషధ నియంత్రణ విభాగం స్పష్టం చేసింది.
మైనర్లకు కండోమ్ లు, గర్భనిరోధక మాత్రల అమ్మకాలపై ఎలాంటి నిషేధం విధించలేదని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది, మైనర్లు కొనడానికి వచ్చినప్పుడు కౌన్సెలింగ్ ఇవ్వాలని మాత్రమే ఫార్మసీలకు సూచించామని తెలిపింది.
మైనర్‌లకు కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలను విక్రయించడాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించిందని మీడియా నివేదికల నేపథ్యంలో, మైనర్లకు మాత్రలు, కండోమ్‌లను విక్రయించడంపై రాష్ట్రంలో ఎటువంటి నిషేధం లేదని రాష్ట్ర ప్రభుత్వ ఔషధ నియంత్రణ విభాగం స్పష్టం చేసింది. అయితే, కండోమ్‌లు, గర్భనిరోధక సాధనాలను కొనుగోలు చేసే మైనర్‌లకు కౌన్సెలింగ్ ఇవ్వాలని ఫార్మాసిస్ట్‌లను కోరుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
సాధారణ తనిఖీల సమయంలో స్కూల్ స్టూడెంట్స్ బ్యాగులలో కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలు కనిపించిన సంఘటనల తర్వాత ప్రభుత్వం మైనర్లకు అమ్మకాలను నిషేధించినట్టు గతంలో చాలా మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
18 ఏళ్ల లోపు వారికి కండోమ్‌లు, ఓరల్ కాంట్రాసెప్టివ్స్ లేదా యాంటీ డిప్రెసెంట్‌లను విక్రయించవద్దని డ్రగ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్, ఫార్మసీలకు సూచించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. కర్ణాటక డ్రగ్స్ కంట్రోలర్ భాగోజీ టి ఖానాపూరే మాట్లాడుతూ, “ లైంగికంగా సంక్రమించే వ్యాధులను నివారించడానికి, జనాభా నియంత్రణకు కూడా ప్రభుత్వం కండోమ్‌లను ప్రోత్సహిస్తోంది. అయితే, ఇది టీనేజ్ లేదా స్కూల్ పిల్లలకు కాదు. అందువల్ల, తక్కువ వయస్సు ఉన్న యువకులకు మందులు విక్రయించకూడదని సర్క్యులర్ ఖచ్చితంగా చెబుతుంది.'' అని చెప్పారు.
అయితే, ఇప్పుడు కర్ణాటక డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ నిషేధం విధించారనే నివేదికలను ఖండించింది. ఈ విషయంపై మీడియా తన సర్క్యులర్‌ను తప్పుగా వ్యాఖ్యానించిందని పేర్కొంది.
ది న్యూస్ మినిట్ నివేదిక ప్రకారం, భాగోజీ టి ఖానాపూరే ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ, “మేము నిషేధం విధిస్తూ ఎటువంటి సర్క్యులర్ జారీ చేయలేదు. దీనిపై మీడియాలో తప్పుడు వార్తలు వచ్చాయి. కండోమ్ లు. గర్భనిరోధక మాత్రలను కొనుగోలు చేయాలనుకునే మైనర్‌లకు కౌన్సెలింగ్ ఇవ్వమని మాత్రమే ఫార్మసిస్ట్‌లకు చెప్పాము.'' అని అన్నారు.
మైనర్లకు కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రల అమ్మకాలపై నిషేధానికి సంబంధించి డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ నుండి తమకు ఎలాంటి సర్క్యులర్ లేదా నోటీసు అందలేదని కర్ణాటక రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రవిశంకర్ తెలిపారు.
గతేడాది నవంబర్‌లో విద్యార్థుల స్కూల్ బ్యాగుల్లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు, లైటర్లు ఉన్నట్లు గుర్తించిన ఘటనతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటన తర్వాత కర్ణాటకలోని అసోసియేటెడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ స్కూల్స్ (KAMS) విద్యార్థుల స్కూల్ బ్యాగులను క్రమం తప్పకుండా పరిశీలించాలని పాఠశాలల యాజమాన్యాలను అభ్యర్థించింది.