Telugu Global
National

హిజాబ్ కేసును వాదించిన ఇద్దరు న్యాయవాదులకు రూ.88 లక్షలు చెల్లించిన కర్ణాటక ప్రభుత్వం

ఈ కేసును వాదించినందుకు మెహతాకు రూ.39.60 లక్షలు, నటరాజ్‌కు రూ.48.40 లక్షలు చెల్లించినట్లు పరిశోధనాత్మక డిజిటల్ పబ్లికేషన్ 'ది ఫైల్' వెల్లడించింది. ఈ కేసులో తుషార్ తొమ్మిది సార్లు కోర్టుకు హాజరు కాగా, నటరాజ్ 11 సార్లు కోర్టుకు హాజరయ్యారు.

హిజాబ్ కేసును వాదించిన ఇద్దరు న్యాయవాదులకు రూ.88 లక్షలు చెల్లించిన కర్ణాటక ప్రభుత్వం
X

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసిన హిజాబ్ నిషేధానికి మద్దతుగా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, భారత అదనపు సొలిసిటర్ జనరల్ KM నటరాజ్‌లకు 88 లక్షల రూపాయలు చెల్లించింది.

ఈ కేసును వాదించినందుకు మెహతాకు రూ.39.60 లక్షలు, నటరాజ్‌కు రూ.48.40 లక్షలు చెల్లించినట్లు పరిశోధనాత్మక డిజిటల్ పబ్లికేషన్ 'ది ఫైల్' వెల్లడించింది. ఈ కేసులో తుషార్ తొమ్మిది సార్లు కోర్టుకు హాజరు కాగా, నటరాజ్ 11 సార్లు కోర్టుకు హాజరయ్యారు. ఇద్దరు న్యాయవాదులు ఒక్కో విచారణకు రూ.4.4 లక్షల చొప్పున పారితోషికంగా అందుకున్నారు. భారతదేశ సొలిసిటర్ జనరల్ భారత అటార్నీ జనరల్‌కు లోబడి ఉంటారు. దేశంలో రెండవ అత్యున్నత న్యాయ అధికారి.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో అప్పీళ్ళు దాఖలయ్యాయి. ఆ అప్పీళ్లను 2022లో పరిశీలించిన సుప్రీం కోర్టు జస్టిస్ హేమంత్ గుప్తా పాఠశాలల్లో, కళాశాలల్లో యూనిఫాంను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని తీర్పు చెప్పారు.

కర్నాటకలోని ఉడిపిలోని ఓ కళాశాలలో డిసెంబర్ 2021లో ఈ వివాదం ప్రారంభమైంది. హిజాబ్ ధరించిన అమ్మాయిలను కళాశాల లోపలికి అనుమతించకపోవడంతో తీవ్ర నిరసనలు చెలరేగాయి. ఈ కారణంగా అనేక మంది అమ్మాయిలు చదువులకు కూడా దూరమయ్యారు.

First Published:  19 Jan 2023 3:16 PM IST
Next Story