Telugu Global
National

సాయం కోసం వెళ్తే అత్యాచారం.. యడ్యూరప్పపై పోక్సో కేసు

ఫిబ్రవరి 2న ఓ మహిళ తన కూతురిపై జరిగిన అత్యాచారం కేసులో స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌-సిట్‌ ఏర్పాటు చేసేలా ఒత్తిడి తేవాలని యడ్యూరప్పను కోరేందుకు బెంగళూరులోని ఆయన నివాసానికి వెళ్లింది.

సాయం కోసం వెళ్తే అత్యాచారం.. యడ్యూరప్పపై పోక్సో కేసు
X

కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ లీడర్‌ 81 ఏళ్ల యడ్యూరప్ప చిక్కుల్లో పడ్డారు. ఆయనపై గురువారం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్‌ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్‌ - POCSO యాక్ట్‌ కింద కేసు నమోదైంది. గత నెలలో బెంగళూరులోని తన నివాసంలో ఓ చిన్నారిని లైంగికంగా వేధించారన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.

ఫిబ్రవరి 2న ఓ మహిళ తన కూతురిపై జరిగిన అత్యాచారం కేసులో స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌-సిట్‌ ఏర్పాటు చేసేలా ఒత్తిడి తేవాలని యడ్యూరప్పను కోరేందుకు బెంగళూరులోని ఆయన నివాసానికి వెళ్లింది. ఆ సమయంలో మహిళ వెంట తన కూతురు కూడా ఉంది. అయితే యడ్యూరప్ప తన కూతురిని ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లాడని, తర్వాత బయటకు వచ్చి ఆ బాలికపై అత్యాచారం జరిగిందో లేదో తను చెక్‌ చేశానని చెప్పాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. తర్వాత క్షమాపణలు చెప్పి.. ఈ విషయాన్ని బయట ఎవరితో చెప్పొద్దని తనను కోరాడని చెప్పింది.

మహిళ ఫిర్యాదు ఆధారంగా బెంగళూరు సదాశివనగర్‌ పోలీసులు పోక్సో చట్టంలోని సెక్షన్‌ - 8 (లైంగిక వేధింపులకు పాల్పడడం), ఐపీసీ సెక్షన్ - 354 కింద యడ్యూరప్పపై కేసు నమోదు చేశారు. ఈ అంశం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

First Published:  15 March 2024 10:34 AM IST
Next Story