Telugu Global
National

కర్ణాటక బీజేపీ మేనిఫెస్టో: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. కర్ణాటకలో కమలం కనికట్టు మేనిఫెస్టో

కర్ణాటక బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో: కర్నాటకలో ఇప్పటికే కాంగ్రెస్ దూకుడు మీద ఉంది. సర్వేలన్నీ హస్తం పార్టీకే అధికారం అని స్పష్టం చేశాయి. ఈ దశలో మేనిఫెస్టో తో మేజిక్ చేయాలనుకుంటోంది బీజేపీ. కమీషన్ రాజ్ సర్కారుతో పరువు పోగొట్టుకున్న కమలదళం, మేనిఫెస్టోతో ఉచితాల గేలం రెడీ చేసింది.

కర్ణాటక బీజేపీ మేనిఫెస్టో: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. కర్ణాటకలో కమలం కనికట్టు మేనిఫెస్టో
X

కర్ణాటక బీజేపీ మేనిఫెస్టో: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. కర్నాటకలో కమలం కనికట్టు మేనిఫెస్టో

కర్నాటకలో అధికారం చేజారుతోందన్న సంకేతాల మధ్య కమలదళం మేనిఫెస్టో హామీలపై గట్టి నమ్మకం పెట్టుకున్నట్టుంది. అందుకే అలవికాని హామీలన్నిటినీ అమలు చేస్తామని అడ్డూ ఆపూ లేకుండా చెప్పేసింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. దాని పేరు ‘ప్రజాధ్వని’.

గ్యాస్ ఫ్రీ, పాలు ఫ్రీ..

గ్యాస్ ధర పెంచి సామాన్యుల నడ్డి విరిచిన మోదీ సర్కారు, కర్నాటక ఎన్నికల్లో ఆ పాపాన్ని కాస్తయినా ప్రక్షాళణ చేసుకునే అవకాశమివ్వాలని ప్రజల్ని కోరుతోంది. బీపీఎల్ కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రతి నెలా రేషన్ సరకులతోపాటు ప్రతి రోజూ అర లీటర్ పాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. మున్సిపాల్టీల్లోని ప్రతి వార్డులో అటల్ ఆహార్ కేంద్రం నెలకొల్పుతామని, పేదలకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తామని పేర్కొంది.

కర్నాటకలో ఇప్పటికే కాంగ్రెస్ దూకుడు మీద ఉంది. సర్వేలన్నీ హస్తం పార్టీకే అధికారం అని స్పష్టం చేశాయి. ఈ దశలో మేనిఫెస్టో తో మేజిక్ చేయాలనుకుంటోంది బీజేపీ. కమీషన్ రాజ్ సర్కారుతో పరువు పోగొట్టుకున్న కమలదళం, మేనిఫెస్టోతో ఉచితాల గేలం రెడీ చేసింది.


బీజేపీ హామీలలో మరికొన్ని..

- విశ్వేశ్వరయ్య విద్యా యోజన పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధి.

- జాతీయ స్థాయి పోటీ పరీక్షలకోసం విద్యార్థులకు కోచింగ్ కోసం ఆర్థిక సాయం.

- మిషన్ స్వాస్థ్య కర్నాటక పేరుతో ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన, సీనియర్ సిటిజన్లకు ఏడాదికోసారి ఉచితంగా మాస్టర్ హెల్త్ చెకప్.

- బెంగళూరును ‘స్టేట్ కేపిటల్ రీజియన్’గా పేర్కొనడం, సమగ్ర, సాంకేతికతతో కూడిన నగర అభివృద్ధి కార్యక్రమాల అమలు.

- ఎలక్ట్రిక్ బస్సులకు ప్రోత్సాహం, బెంగళూరు శివారు ప్రాంతాల్లో ఈవీ సిటీ రూపకల్పన.

- మైక్రో కోల్డ్ స్టోరేజీ కేంద్రాలు, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ల ఏర్పాటు.

- కర్నాటకలో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలు.

First Published:  1 May 2023 6:17 PM IST
Next Story