Telugu Global
National

'తెల‍ంగాణ‌లో కుటుంబపాలన' అని మోడి చేసిన వ్యాఖ్యలపై కపిల్ సిబల్ ఎదురు దాడి

బీజేపీ తాను అధికారంలో ఉన్న చోట కుటుంబ పాలనను సమర్ధిస్తుంది. మిగతా చోట్ల వ్యతిరేకిస్తుంది అని కపిల్ సిబల్ మండిపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందని మోడీ చేసిన వ్యాఖ్యలను సిబల్ తిప్పికొట్టారు.

తెల‍ంగాణ‌లో కుటుంబపాలన అని మోడి చేసిన వ్యాఖ్యలపై కపిల్ సిబల్ ఎదురు దాడి
X

ప్రధాని నరేంద్ర మోడీ నిన్న హైదరాబాద్ పర్యటన సందర్భంగా జరిగిన కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో తెలంగాణ్ అప్రభుత్వం పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని, కుటుంబ పాలనే అవినీతికి కారణమవుతుందని ఆరోపించారు. మోడి చేసిన ఈ వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యులు,కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ఎదురు దాడి చేశారు.

బీజేపీ తాను అధికారంలో ఉన్న చోట కుటుంబ పాలనను సమర్ధిస్తుంది. మిగతా చోట్ల వ్యతిరేకిస్తుంది అని కపిల్ సిబల్ మండిపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందని మోడీ చేసిన వ్యాఖ్యలను సిబల్ తిప్పికొట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ,

అవినీతి, కుటుంబపాలన‌ చేతులు కలిపే ఉంటాయని మోడీ వ్యాఖ్యానించడంపై స్పందించిన సిబల్, 1) పంజాబ్ లో అకాలీలతో 2) ఆంధ్రాలో జగన్ తో 3) హర్యానాలో చౌతాలాలతో 4) J&K లో ముఫ్తీలతో 5) మహారాష్ట్ర లో ఠాక్రేలతో BJP ఎందుకు చేతులు కలిపింది ? వారితో చేరినప్పుడు వారిది కుటుంబ పాలన కాదా ?" అని ప్రశ్నించారు.

మరో ట్వీట్‌లో, సిబల్ , “ అవినీతి, కుటుంబ పాలన చేతులు కలిపే ఉంటాయని ప్రధానమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడతారు, మరి ఆప్‌పై కూడా బీజేపీ అవినీతి ఆరోపణలు చేస్తోంది. అక్కడ కుటుంబ పాలన లేదు కదా ! అవినీతి కి కుటుంబ పాలనకు సంబంధమే లేదు. 'బీజేపీది కుటుంబ పాలన‌ కాదని మీరు అంటున్నారు. మరి బీజేపీ అవినీతికి పాల్పడలేదా? '' అని సిబల్ అన్నారు

First Published:  9 April 2023 12:10 PM IST
Next Story