Telugu Global
National

హీరో దర్శన్ మేనేజర్ ఆత్మహత్య

బెంగళూరులోని దర్శన్ ఫామ్ హౌస్ లో మంగళవారం ఆయన మేనేజర్ శ్రీధర్ శవమై కనిపించాడు.

హీరో దర్శన్ మేనేజర్ ఆత్మహత్య
X

తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో ఇరుక్కొని కన్నడ టాప్ హీరో దర్శన్ కటకటాల పాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దర్శన్ పోలీసు కస్టడీలో ఉండగా..ఆయన మేనేజర్ ఆత్మహత్య చేసుకోవడం కర్ణాటకలో సంచలనం సృష్టిస్తోంది. బెంగళూరులోని దర్శన్ ఫామ్ హౌస్ లో మంగళవారం ఆయన మేనేజర్ శ్రీధర్ శవమై కనిపించాడు. అక్కడ సూసైడ్ నోట్ లభించడంతోపాటు.. తన మొబైల్ ఫోన్లో ఒక వీడియో సందేశం కూడా ఉండడంతో శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఒంటరితనం తనను వేధిస్తోందని.. అందువల్లే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సూసైడ్ నోట్ లో, వీడియోలో శ్రీధర్ పేర్కొన్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని అందులో వెల్లడించాడు. శ్రీధర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపడంతో ఆగ్రహానికి గురైన హీరో దర్శన్ తన అభిమాని అయిన రేణుకా స్వామిని బెంగళూరులోని ఓ షెడ్డుకి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం దర్శన్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఇదిలా ఉంటే దర్శన్ కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఆయన మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడటం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. దర్శన్ హత్య కేసులో అరెస్టై జైల్లో ఉన్న సమయంలో ఆయన మేనేజర్ ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

First Published:  18 Jun 2024 9:59 PM IST
Next Story