Telugu Global
National

కన్నడ సూపర్‌స్టార్‌ దర్శన్ అరెస్టు

చిత్రదుర్గ జిల్లాకు చెందిన రేణుకాస్వామి.. ఓ మెడికల్‌ షాపులో వర్క్ చేస్తుండేవాడు. నెల రోజుల క్రితం రేణుకాస్వామి హత్యకు గురి కాగా.. శనివారం సుమన్నహళ్లి వంతెన దగ్గర అతని డెడ్‌బాడీని గుర్తించారు.

కన్నడ సూపర్‌స్టార్‌ దర్శన్ అరెస్టు
X

కన్నడ సూపర్‌ స్టార్‌ దర్శన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ హత్య కేసులో ఈ తెల్లవారుజామున దర్శన్‌ను RRనగర్‌లోని ఆయన నివాసంలో కామాక్షిపాల్య పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపాడన్న కారణంతో రేణుకాస్వామి అనే వ్యక్తిని కొంతమంది హత్య చేశారు. ఐతే దర్శన్ సూచనల మేరకు ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసులో ఇప్పటివరకూ దర్శన్‌తో పాటు 10 మంది అరెస్టయినట్లు తెలుస్తోంది.



చిత్రదుర్గ జిల్లాకు చెందిన రేణుకాస్వామి.. ఓ మెడికల్‌ షాపులో వర్క్ చేస్తుండేవాడు. నెల రోజుల క్రితం రేణుకాస్వామి హత్యకు గురి కాగా.. శనివారం సుమన్నహళ్లి వంతెన దగ్గర అతని డెడ్‌బాడీని గుర్తించారు. ఈ హత్య కేసులో దర్శన్‌ హస్తం ఉందని బెంగళూరు సీపీ దయానంద్ చెప్పారు. రేణుకాస్వామిని బెంగళూరుకు తీసుకువచ్చి.. ఓ షెడ్డులో దర్శన్‌ సమక్షంలోనే ఆయన బౌన్సర్లు దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో రేణుకాస్వామి అక్కడికక్కడే మరణించారు. తర్వాత దర్శన్‌ సూచనలతో డెడ్‌బాడీని నలుగురు నిందితులు ఓ కల్వర్టులో పడేశారు. దర్శన్ సూచనల మేరకే హత్య చేసినట్లు పట్టుబడినవారిలో నలుగురు నిందితులు అంగీకరించినట్లు సమాచారం.


కన్నడ నటి పవిత్ర గౌడతో దర్శన్‌కు సంబంధం ఉందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దర్శన్‌తో తనకు సంబంధం ఉందని గతంలో పవిత్ర తన ఇన్‌స్టాలో పోస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో దర్శన్‌ భార్య విజయలక్ష్మి పవిత్ర గౌడపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఐతే నటి పవిత్ర గౌడను ఉద్దేశించి రేణుకాస్వామి సోషల్‌మీడియాలో కించపరిచే పోస్టులతో పాటు ఆమెకు అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే రేణుకాస్వామిని హత్య జరిగింది.

First Published:  11 Jun 2024 8:12 AM GMT
Next Story