Telugu Global
National

కంగనా.. మళ్లీ అడ్డంగా దొరికిపోయింది

గొడ్డు మాంసం తింటానని వస్తున్న వార్తలను మండి బీజేపీ లోక్‌సభ అభ్యర్థి, హీరోయిన్‌ కంగనా రనౌత్ ఖండించారు.

కంగనా.. మళ్లీ అడ్డంగా దొరికిపోయింది
X

గొడ్డు మాంసం తింటానని వస్తున్న వార్తలను మండి బీజేపీ లోక్‌సభ అభ్యర్థి, హీరోయిన్‌ కంగనా రనౌత్ ఖండించారు. వివాదంపై ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. "గొడ్డు మాంసం కాదు, అసలు ఎలాంటి రెడ్ మీట్ నేను తినను. నాపై రూమర్స్ చేయడం సిగ్గుచేటు. నేను దశాబ్దాలుగా యోగ, ఆయుర్వేద జీవన విధానాన్ని ప్రచారం చేస్తున్నా. నా ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కొంద‌రు ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ప్రజలకు నేనేంటో తెలుసు. హిందువులంతా గర్వించదగ్గ వ్యక్తిని నేను.. జైశ్రీరామ్" అంటూ కంగనా ట్వీట్ చేశారు.

కంగనా ట్వీట్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తాజాగా గొడ్డు మాంసం తిననని ట్వీట్ చేసిన కంగన.. 2019 మే 19న మాత్రం గొడ్డు మాంసం తింటే తప్పేంటి?. దానికీ మతంతో సంబంధం ఏంటి? అని ట్వీట్ వేశారు. దీంతో ఈ రెండు ట్వీట్లను పోల్చుతూ నెటిజన్లు ఆమెపై సెటైర్లు వేస్తున్నారు. సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

కాగా కంగ‌నా ర‌నౌత్ ఆవు మాంసాన్ని తిన్నట్లు కాంగ్రెస్ నేత విజ‌య్ వాడెట్టివార్ 3రోజుల కిందట ఆరోపించారు. అప్పటి నుంచి ఈ వివాదం నడుస్తోంది. బీజేపీ టికెట్ ఇవ్వడంతో ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు కంగనా. చివరగా ఆమె "తేజస్" సినిమాలో నటించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా రూపొందిన "ఎమర్జెన్సీ"లో ఆమె ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి ఆమె దర్శకత్వం కూడా వహించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


First Published:  8 April 2024 1:11 PM IST
Next Story