Telugu Global
National

లిక్కర్ కేసులో ట్విస్ట్.. స్పెషల్‌ జడ్జి ట్రాన్స్‌ఫర్‌

జడ్జి నాగ్‌పాల్ స్థానాన్ని జస్టిస్ కావేరి భావేజా భర్తీ చేయనున్నారు. మద్యం పాలసీ కేసు ప్రారంభమైనప్పటి నుంచి ఈ కేసును జస్టిస్‌ నాగ్‌పాల్ విచారిస్తున్నారు.

లిక్కర్ కేసులో ట్విస్ట్.. స్పెషల్‌ జడ్జి ట్రాన్స్‌ఫర్‌
X

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులు విచారిస్తున్న రౌస్‌ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి MK నాగ్‌పాల్ బదిలీ అయ్యారు. హజారి కోర్టు డిస్ట్రిక్ట్‌ జడ్జిగా ఆయన ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఈ బదిలీ తక్షణమే అమల్లోకి రానుంది.

జడ్జి నాగ్‌పాల్ స్థానాన్ని జస్టిస్ కావేరి భావేజా భర్తీ చేయనున్నారు. మద్యం పాలసీ కేసు ప్రారంభమైనప్పటి నుంచి ఈ కేసును జస్టిస్‌ నాగ్‌పాల్ విచారిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జస్టిస్‌ నాగ్‌పాల్‌ను బదిలీ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ట్రాన్స్‌ఫర్‌ జాబితా ప్రకారం జస్టిస్‌ నాగ్‌పాల్ సహా ఢిల్లీ హయ్యర్ జ్యుడిషియల్ సర్వీసెస్‌కు చెందిన 27 మంది న్యాయమూర్తులు బదిలీ అయ్యారు.

సంచలనంగా మారిన ఈ కేసులో పలువురు ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. మనీష్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా.. కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రిమాండ్‌లో ఉన్నారు.

First Published:  19 March 2024 6:18 PM GMT
Next Story