జోడో యాత్రలో జోష్ : వణికిస్తున్న చలిలో బస్‌పైకి ఎక్కి చొక్కాలు విప్పి కార్యకర్తల నృత్యాలు
దేశవ్యాప్త భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు హర్యానాలోని కర్నాల్‌లో పర్యటిస్తున్నారు. దట్టమైన పొగమంచు, చలిగాలుల మధ్యనే వేలాది మంది ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాహుల్ కు స్వాగతం చెప్పడానికి ఈ రోజు పొద్దున్నే రోడ్లెక్కారు.
ఒకవైపు శరీరాలు గడ్డకట్టే చలి, దట్టమైన పొగమంచుతో నిండి ఇంటి నుంచి బయటకు రాలేని స్థితిలో కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి బస్సుపైకి ఎక్కి నృత్యాలు చేస్తూ రాహుల్ గాంధీకి స్వాగతం చెప్తున్న దృశ్యాలు తెరపైకి వచ్చాయి.
దేశవ్యాప్త భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు హర్యానాలోని కర్నాల్‌లో పర్యటిస్తున్నారు. దట్టమైన పొగమంచు, చలిగాలుల మధ్యనే వేలాది మంది ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాహుల్ కు స్వాగతం చెప్పడానికి ఈ రోజు పొద్దున్నే రోడ్లెక్కారు. చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు చలిలోనూ చొక్కా లేకుండా డ్యాన్స్ చేస్తూ రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. ఈ రోజు కర్నాల్ లో 4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది.
Josh in Jodo Yatra: Dances of shirtless activists board the bus in the freezing cold
భారత్ జోడో యాత్రవల్లే కాకుండా రాహుల్ గాంధీ వేసుకున్న టీ షర్ట్ వల్ల కూడా వార్తల్లో ఉన్నారు. ఇటీవల భారత్ జోడో యాత్ర లో రాహుల్ కేవలం టీ-షర్ట్ ధరిస్తున్నారు. సాదా తెల్లటి టీ షర్ట్‌లో ఢిల్లీ చలికాలంలో అతను పాదయాత్ర చేసిన తీరును చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.ఇప్పుడు హర్యానా కర్నాల్‌లోని కాంగ్రెస్ కార్యకర్తలు తమ నాయకుడిని స్ఫూర్తిగా తీసుకుని చొక్కాలు విప్పినట్టు కనిపిస్తోంది.
కొందరు పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి బస్సుల పైకప్పులపైకి ఎక్కి అద్భుతమైన నృత్యం చేశారు. చొక్కా లేకుండా డ్యాన్స్ చేస్తున్న నాయకులు, కార్యకర్తలు తలపై గులాబీ రంగు తలపాగాలు ధరించారు.
హర్యానాలోని ప్రతి జిల్లాలో కూడా భారత్ జోడో యాత్రకు విశేష ఆధరణ లభిస్తోంది. రాహుల్ గాంధీ రావడానికి ఒక రోజు ముందే కర్నాల్‌లో కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు.
రాహుల్ యాత్ర జనవరి 10న శంభు బోర్డర్ మీదుగా పంజాబ్‌లోకి ప్రవేశించనుంది. 11న ఫతేగఢ్ సాహిబ్‌లో ప్రార్ధనల అనంతరం భారీ బహిరంగసభను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తారు.
ఇక సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన రాహుల్ యాత్ర కేరళ, తమిళనాడు, కర్నాటక, ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్ధాన్, ఢిల్లీ, హర్యానాల మీదుగా సాగుతోంది. జనవరి 30న కశ్మీర్‌లో రాహుల్ భారత్ జోడో యాత్ర ముగియనుంది.
#WATCH | Congress supporters dance shirtless amid dense fog during Bharat Jodo Yatra in Haryana's Karnal pic.twitter.com/0kmHmkL1nK
— ANI (@ANI) January 8, 2023