Telugu Global
National

భారత ఐటీ రంగంలో ఒకవైపు తొలగింపులు, మరో వైపు ఉద్యోగ నియామకాల్లో 25% క్షీణత‌

భారత ఐటీ రంగంలో నియామకాల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉద్యోగాల వృద్ధి 25 శాతం క్షీణించిందని naukri.com నివేదిక గురువారం వెల్లడించింది.

భారత ఐటీ రంగంలో ఒకవైపు తొలగింపులు, మరో వైపు ఉద్యోగ నియామకాల్లో 25% క్షీణత‌
X


గత సంవత్సరం నుండి ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ వేగవంతం అయ్యింది. అత్యంత ప్రముఖ కంపెనీలు కూడా వేలాది మంది ఉద్యోగులను ఇళ్ళకు పంపిస్తున్నాయి. బారత దేశంలో కూడా ఐటీ కంపెనీలు అదే బాటన నడుస్తున్నాయి. ఉద్యోగ నియామకాల్లో కూడా క్షీణత ఉందని naukri.com నివేదిక స్పష్టం చేసింది.

భారత ఐటీ రంగంలో నియామకాల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉద్యోగాల వృద్ధి 25 శాతం క్షీణించిందని ఆ నివేదిక గురువారం వెల్లడించింది.

naukri.com నివేదిక ప్రకారం, IT దిగ్గజ కంపెనీల‌, యునికార్న్‌లలో నియామకాలు క్షీణించాయి. అయితే ఇతర IT స్టార్టప్‌లలో ట్రెండ్‌లు గత సంవత్సరంతో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి.

ఫ్రెషర్స్ ను ఉద్యోగాల్లోకి తీసుకోవడం బాగా తగ్గిపోయిందని నివేదిక తెలిపింది. అంతే కాదు 10, 12 ఏళ్ళ కన్నా తక్కువ అనుభవం ఉన్న వాళ్ళ రిక్రూట్ మెంట్ కూడా బాగా తగ్గిపోయిందట. సీనియర్స్ (12 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు) రిక్రూట్ మెంట్ మాత్రం స్థిరంగా ఉందని రిపోర్ట్ పేర్కొంది.

“సంవత్సరం ప్రారంభమైనప్పుడు, బీమా, చమురు, ఆతిథ్యం వంటి ఐటీయేతర రంగాల్లో నియామకాలు ఎక్కువగా జరిగాయి. ఆసక్తికరంగా, గత ఏడాది ఐటి రంగంలో ఎక్కువగా ఉద్యోగాలు కల్పించిన మెట్రో నగరాలకన్నా, ఈ సారి అహ్మదాబాద్, బరోడా వంటి అభివృద్ధి చెందుతున్న నగరాలు కొంత నయంగా ఉన్నాయి., ”అని Naukri.com చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ అన్నారు.

2023 నియామకాల్లో కూడా 12 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న సీనియర్ నిపుణుల నియామకాలు ఎక్కువగా జరగనున్నాయి. గత సంవత్సరం తో పోల్చుకుంటే ఇప్పటికే ఈ నిపుణుల రిక్రూట్ మెంట్ 20 శాతం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది.

ఫ్రెషర్లు, మిడ్-ఎక్స్పీరియన్స్ స్థాయి నిపుణుల నియామకాలు మాత్రం తగ్గుదల చూపిస్తున్నాయి.

First Published:  2 Feb 2023 9:28 AM GMT
Next Story