Telugu Global
National

సుప్రీంకోర్టులో హేమంత్‌ సోరెన్‌ పిటిషన్‌

అరెస్టుకు ముందు రాష్ట్ర ప్రజలు, పార్టీ నేతలను ఉద్దేశించి సోరెన్‌ ఓ వీడియోను రికార్డు చేశారు. బుధవారం రికార్డు చేసిన ఆ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.

సుప్రీంకోర్టులో హేమంత్‌ సోరెన్‌ పిటిషన్‌
X

తన అరెస్టును సవాలు చేస్తూ జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మనీలాండరింగ్‌ కేసులో మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ని ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా హేమంత్‌ సోరెన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం కోర్టు విచారణ జరపనుంది.

అరెస్టుకు ముందు రాష్ట్ర ప్రజలు, పార్టీ నేతలను ఉద్దేశించి సోరెన్‌ ఓ వీడియోను రికార్డు చేశారు. బుధవారం రికార్డు చేసిన ఆ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులో ఏముందంటే.. ’ఈడీ నన్ను అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దానికి నేనేమీ బాధపడటం లేదు. ఎందుకంటే నేను శిబు సోరెన్‌ కుమారుడిని. రోజంతా ప్రశ్నించిన తర్వాత నాకు సంబంధంలేని కేసులో అధికారులు అరెస్టు చేయాలని నిర్ణయానికి వచ్చారు. వారు ఎలాంటి ఆధారాలనూ గుర్తించలేదు’ అని హేమంత్‌ సోరెన్‌ తెలిపారు. ఈడీ అధికారులు ఢిల్లీలోని తన నివాసంలో సోదాలు నిర్వహించి తన ప్రతిష్ట‌ను దెబ్బతీసేందుకు యత్నించారని ఆయన చెప్పారు. పేదలు, ఆదివాసీలు, దళితులు, అమాయక ప్రజలపై అరాచకాలకు పాల్పడే వారిపై ఇప్పుడు సరికొత్త పోరాటం చేయాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు.

First Published:  1 Feb 2024 3:52 PM IST
Next Story