హర్ ఘర్ తిరంగా ప్రజలకు మాత్రమేనా ? బీజేపీ నాయకులకు వర్తించదా ?
నిన్న దుబాయ్ లో జరిగిన ఆసియా కప్ 2022 క్రికెట్ మ్యాచ్ లో పాక్ పై భారత్ విజయం సాధించిన సందర్భంగా అమిత్ షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా వ్యవహరించిన తీరు వివాదాస్పదమయ్యింది. ఓ భారతీయుడు ఆయనకు జాతీయ జెండాను ఇవ్వడానికి ప్రయత్నించగా జై షా 'నో' అని చెప్పి జెండా తీసుకోవడానికి నిరాకరించారు. ఈ వ్యవహారంపై నెటిజనులు, విపక్షాలు ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
Jay Shah Refuses To Hold Indian Flag During Ind Vs Pak Asia Cup Matchహర్ ఘర్ తిరంగా ప్రధాని మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మోడీ పిలుపు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ దేశ ప్రజలు మూడురంగుల జెండాని ప్రేమిస్తారు. ఆగస్టు 15, జనవరి 26 నాడు జెండాను ఎగరేయడమే కాదు..ముఖ్యంగా క్రీడల్లో మన దేశం టీం గెల్చినప్పుడు జెండాలు పట్టుకొని హర్షం వ్యక్తం చేయడం భారతీయులకు మామూలే. అయితే ఓ బీజేపీ నాయకుడు, ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా కుమారుడు మాత్రం మూడురంగుల జెండాను పట్టుకోవడానికి తిరస్కరించాడు.
ఆసియా కప్ 2022 లో భాగంగా నిన్న దుబాయ్ లో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఇండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ సమయంలో స్టేడియంలో భారత ప్రేక్షకులు మూడు రంగుల జెండాలను పట్టుకొని కేరింతలు కొట్టారు. అక్కడ పండుగ వాతావరణం నెలకొనడమే కాక స్టేడియం అంతా మూడు రంగుల జెండాలతో నిండిపోయింది. ఆ సమయంలో అమిత్ షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా దగ్గరికి ఓ భారతీయుడు వెళ్ళి జాతీయ జెండాను ఆయనికివ్వడానికి ప్రయత్నించాడు. అయితే జై షా మాత్రం 'నో' అని చెప్పి జెండా తీసుకోవడానికి నిరాకరించారు.
జై షా జాతీయ జెండాను తిరస్కరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు ఆయనపై, బీజేపీ పై దుమ్మెత్తి పోస్తున్నారు.
బీజేపీ నాయకుల దేశభక్తి ఇతరులకు చెప్పడానికే తప్ప తాము ఆచరించడానికి కాదని ఆరోపిస్తున్న నెటిజనులు ''ప్రతి భారతీయుడు ఇంటి మీద జెం డాను ఎగురవేసి దేశం పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కేం ద్ర మం త్రి కుమారుడివైన నువ్వు జెండా పట్టుకోవడానికి నిరాకరించావు ఇదేనా నీ దేశభక్తి, సంస్కారం'' అం టూ నెటిజనులు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నా రు.
ప్రతి ఇంటి మీదా జాతీయ జెండాను ఎగురవేయాలంటూ మాకు సలహాలను మాత్రం ఇస్తారు.మీరు మాత్రం దాన్ని పాటించరా అని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై బీసీసీఐ కార్య దర్శి గా ఆయన వివరణ ఇవ్వా ల్సిం దేనం టూ నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు.
విపక్షాలు కూడా జైషా పై విమర్షలు గుప్పించారు కాంగ్రెస్ , శివసేన, తృణమూల్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) నాయకులు కూడా బిసిసిఐ కార్యదర్శిపై దాడి చేశారు.
భారతీయ జెండాను పట్టుకోవడానికి బీజేపీయేతర నాయకులు ఎవరైనా నిరాకరించి ఉంటే, ఈ పాటికి బీజేపీ ఐటీ వింగ్ మొత్తం యాంటీ నేషనల్ అని విరుచుకపడేవాళ్ళు. గోడి మీడియా దానిపై రోజంతా చర్చా కార్యక్రమం నడిపేది అని టీఆరెస్ నాయకుడు క్రిషాంక్ ట్విట్ చేశారు.
జే షా పై తన మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావం తీవ్రంగా ఉంది అని వైఎస్సార్ అనే టీఆరెస్ నాయకుడు విమర్షించారు.
నిన్న దుబాయ్ లో జరిగిన ఆసియా కప్ 2022 క్రికెట్ మ్యాచ్ లో పాక్ పై భారత్ విజయం సాధించిన సందర్భంగా అమిత్ షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా వ్యవహరించిన తీరు వివాదాస్పదమయ్యింది. ఓ భారతీయుడు ఆయనకు జాతీయ జెండాను ఇవ్వడానికి ప్రయత్నించగా జై షా 'నో' అని చెప్పి జెండా తీసుకోవడానికి నిరాకరించారు. ఈ వ్యవహారంపై నెటిజనులు, విపక్షాలు ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
If it was any non bjp leader who refused to hold the Indian Flag, the whole of BJP IT Wing would have called Anti National and the Godi Media would have day long debates on it ....
— krishanKTRS (@krishanKTRS) August 28, 2022
Luckily its Shahenshah's Son Jay Shah pic.twitter.com/zPZStr2I3D