Home > NEWS > National > 'ఒంటరిగా వచ్చే' మహిళల ప్రవేశాన్ని నిషేధించిన ఢిల్లీ జామా మసీదు - అబ్బాయిలను కలిసే ప్రదేశంగా మార్చొద్దంటూ హెచ్చరిక
'ఒంటరిగా వచ్చే' మహిళల ప్రవేశాన్ని నిషేధించిన ఢిల్లీ జామా మసీదు - అబ్బాయిలను కలిసే ప్రదేశంగా మార్చొద్దంటూ హెచ్చరిక
ఒంటరిగా వస్తున్న మహిళలు "అబ్బాయిలను కలిసే" ప్రదేశంగా ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో ఇలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
BY Telugu Global24 Nov 2022 10:22 AM GMT
X
Telugu Global Updated On: 24 Nov 2022 12:15 PM GMT
ఇకపై "ఒంటరిగా వచ్చే" మహిళల ప్రవేశాన్ని నిషేధించినట్లు ఢిల్లీలోని జామా మసీదు అధికారికంగా ప్రకటించింది. ఇలా ఒంటరిగా వస్తున్న మహిళలు "అబ్బాయిలను కలిసే" ప్రదేశంగా ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో ఇలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఒంటరిగా ఇక్కడికి వచ్చే, తప్పుడు పనులు చేసే, వీడియోలు చేసే మహిళలపై ఆంక్షలు విధించినట్లు జామా మసీదు పీఆర్వో సబీవుల్లా ఖాన్ తెలిపారు. మహిళలు తమ భర్తలు లేదా కుటుంబాలతో వచ్చేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని చెప్పారు.
Next Story