జల్లికట్టు లొల్లి: ప్రజలకు పోలీసులకు మధ్య ఘర్షణ, అనేక మందికి గాయాలు, వాహనాలు ధ్వంసం
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా గోబాచంద్ర గ్రామంలో ఈ రోజు జల్లికట్టు నిర్వహించేందుకు ప్రజలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. జల్లికట్టును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా వేలాదిగా ప్రజలు హాజరయ్యారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు జల్లికట్టును జరగనివ్వలేదు.
జల్లికట్టుకు పోలీసులుఅనుమతి నిరాకరించడంతో వేలాది మంది జనం రోడ్డెక్కారు. జాతీయ రహదారిని బ్లాక్ చేశారు. పోలీసులు వాళ్ళను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేయడంతో పోలీసులపై దాడి చేశారు. ఈ సంఘటనలో 8 వాహనాలు ధ్వంసం కాగా, 6గురు పోలీసులు, 20 మందినిరసనకారులు గాయాలపాలయ్యారు.
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా గోబాచంద్ర గ్రామంలో ఈ రోజు జల్లికట్టు నిర్వహించేందుకు ప్రజలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. జల్లికట్టును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా వేలాదిగా ప్రజలు హాజరయ్యారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు జల్లికట్టును జరగనివ్వలేదు. దాంతో వేలాదిగా ప్రజలు కర్నాటక, తమిళనాడు జాతీయ రహదారిపై హోసూరు వద్ద బైటాయించారు. వారిని అక్కడినుంచి పంపడాని పోలీసులు చేసిన ప్రయత్నం విఫలమవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దాంతో తిరగబడ్డ ప్రజలు పోలీసులపై రాళ్ళు విసిరారు. 5 ఆర్టీసీ బస్సులను, 3 పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో ఓ మహిళా ఎస్ ఐ తో సహా 6గురు పోలీసులకు, 20 మంది నిరసనకారులకు గాయాలయ్యాయి.
ఇంత జరిగినా పోలీసులు నిరసనకారులను ఆపలేక చేతులెత్తేశారు. కృష్ణగిరి నుంచి పోలీసులు అదనపు బలగాలను తరలించారు. ఈ ఘర్షణ మొత్తం జాతీయ రహదారి మీద జరగడంతో దాదాపు 2 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది.
మరో వైపు హుటాహుటిన అక్కడికి చేరుకున్న కృష్ణగిరి కలెక్టర్ గ్రామ పెద్దలతో చర్చలు జరిపారు. జల్లికట్టుకు అనుమతి ఇస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. దాంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది.