Telugu Global
National

కరోనా పరిహారంపై కూడా పన్నుబాదుడు..

గడువు దాటితే.. దాన్ని కరోనా సాయం కింద చూపించలేరు, అది ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది. 2022 డిసెంబర్‌ 31వ తేదీ లేదా ఆర్థిక సంవత్సరం ముగియడానికి 9 నెలల ముందు ఆ మొత్తం అందుకుని ఉండాలని వెల్లడించింది ఐటీ శాఖ.

కరోనా పరిహారంపై కూడా పన్నుబాదుడు..
X

కరోనా కష్టకాలంలో హఠాత్తుగా కుటుంబ పెద్దలను కోల్పోయిన వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో మృతుల కుటుంబాలకు బంధువులు, స్నేహితులు, వారు పనిచేసిన సంస్థలు ఆర్థికంగా సహాయం అందించాయి. అయితే ఆ సహాయంపై కూడా పన్ను వేసేందుకు కేంద్రం రెడీ అయింది. కరోనా సాయాన్ని ఆదాయంగా ఎలా చూపాలో ఐటీ శాఖ ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రం సాయం చేయకపోగా, ఆ సాయంపై నిస్సిగ్గుగా పన్ను విధించడం ఏంటనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కరోనా బారిన పడిన వారికి, వారి కుటుంబసభ్యులకు.. అందిన ఆర్థిక సాయం వివరాలు బహిర్గతం చేయాలని ఐటీ శాఖ సూచించింది. ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసే గడువు ముగిసింది కాబట్టి.. ఆయా సంస్థల యజమానులు లేదా బంధువుల నుంచి ఆర్థిక సాయం లేదా పరిహారం పొందిన వారు ఫారం-ఎ దాఖలు చేయాలని పేర్కొంది. ఆ సాయం మొత్తం రూ.10 లక్షలు దాటితే పన్ను చెల్లించాలని సూచించింది. కరోనా కారణంగా ఓ వ్యక్తి చనిపోతే, ఆరు నెలల్లోపు ఆర్థిక సాయం అందితే.. అప్పుడు మాత్రమే కరోనా సాయం కింద ఆ ఆదాయాన్ని చూపించే అవకాశముంది. గడువు దాటితే.. దాన్ని కరోనా సాయం కింద చూపించలేరు, అది ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది. 2022 డిసెంబర్‌ 31వ తేదీ లేదా ఆర్థిక సంవత్సరం ముగియడానికి 9 నెలల ముందు ఆ మొత్తం అందుకుని ఉండాలని వెల్లడించింది ఐటీ శాఖ.

సవాలక్ష కండిషన్లు..

కరోనా సాయం కింద ఐటీ మినహాయింపులు పొందాలంటే.. సవాలక్ష కండిషన్లు పాటించాల్సిందే. కరోనా సోకిందని నిర్థారించే రిపోర్ట్ కూడా ఇప్పుడు సమర్పించాల్సి ఉంటుంది. కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరినప్పటినుంచి తీసుకున్న చికిత్స, మెడికల్ బిల్లులు అవసరం. ఆర్థిక సాయం అందించిన వ్యక్తి, వారు పనిచేసిన సంస్థ వివరాలు. కొవిడ్ కారణంగానే మరణించారన్నట్టుగా డెత్ సర్టిఫికెట్. ఇవన్నీ సమర్పిస్తేనే.. కరోనా ఆర్థిక సాయానికి ఐటీ మినహాయింపు ఉంటుంది. లేకపోతే దానిపై కూడా పన్నుబాదుడు తప్పదు.

First Published:  15 Aug 2022 2:54 AM GMT
Next Story