Telugu Global
National

భూ క‌క్ష్య‌ను పూర్తిచేసిన‌ చంద్ర‌యాన్‌-3.. - ఆగ‌స్టు 5న చంద్రుడి క‌క్ష్య‌లోకి..

బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్ వ‌ర్కింగ్ కేంద్రం (ISTRAC)లో పెరీజి-పైరింగ్ దశ పూర్తయిందని తెలిపింది. చంద్రయాన్-3ని ట్రాన్స్ లూనార్ ఆర్బిట్ లో విజయవంతంగా ప్రవేశపెట్టామ‌ని పేర్కొంది.

భూ క‌క్ష్య‌ను పూర్తిచేసిన‌ చంద్ర‌యాన్‌-3.. - ఆగ‌స్టు 5న చంద్రుడి క‌క్ష్య‌లోకి..
X

భూ క‌క్ష్య‌ను పూర్తిచేసిన‌ చంద్ర‌యాన్‌-3.. - ఆగ‌స్టు 5న చంద్రుడి క‌క్ష్య‌లోకి..

చంద్ర‌యాన్‌-3 ప్రాజెక్టులో మ‌రో ముంద‌డుగు ప‌డింది. 18 రోజుల‌పాటు భూమి చుట్టూ త‌న క‌క్ష్య‌ల‌ను పూర్తిచేసుకున్న చంద్ర‌యాన్‌-3.. తాజాగా చంద్రుడి క‌క్ష్య వైపు దూసుకెళుతోంది. చంద్రునిపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విష‌యం తెలిసిందే. ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్-3 కక్ష్యను పెంచి ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.

దీనిపై ఇస్రో స్పందిస్తూ.. చంద్రయాన్-3 విజయవంతంగా భూమి కక్ష్యలను పూర్తి చేసుకొని చంద్రుడి వైపు వెళుతోంద‌ని వివ‌రించింది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్ వ‌ర్కింగ్ కేంద్రం (ISTRAC)లో పెరీజి-పైరింగ్ దశ పూర్తయిందని తెలిపింది. చంద్రయాన్-3ని ట్రాన్స్ లూనార్ ఆర్బిట్ లో విజయవంతంగా ప్రవేశపెట్టామ‌ని పేర్కొంది. ఇక తదుపరి ఘ‌ట్టం చంద్రుడి కక్ష్యలోకి వెళ్లడమే అని తెలిపింది. చంద్ర‌యాన్‌-3ని ఆగస్టు 5న చంద్రుడి క‌క్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు ప్రణాళిక రూపొందించినట్టు ఇస్రో వెల్లడించింది.

ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్‌తో కూడిన చంద్రయాన్-3 జూలై 14న తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన విష‌యం తెలిసిందే. అనుకున్నట్లుగానే అన్ని ప్రక్రియలూ సజావుగా జరిగితే ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెడుతుంది.

First Published:  1 Aug 2023 2:26 AM GMT
Next Story