చంద్రయాన్–3.. ఇంకా యాక్టివ్‌గానే
చంద్రయాన్–3 ప్రయోగంలో భాగంగా అందులో పలు సంస్థలకు చెందిన ఎల్‌ఆర్‌ఎలను అమర్చిన విషయాన్ని ఇస్రో అధికారులు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్–3 ఇంకా యాక్టివ్‌గానే ఉంది. దానిలో అమర్చిన పరికరాలు నిద్రాణ స్థితిలోనూ దక్షిణ ధ్రువం నుంచి లొకేషన్లను గుర్తిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇస్రో అధికారులు శుక్రవారం బెంగళూరులో విలేకరులకు వెల్లడించారు. అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రయాన్–3 ల్యాండర్లో నాసాకు చెందిన లూనార్ రికనిసెన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్డీ)ను అమర్చారు. ఇందులోని లేజర్ రెట్రో రెఫ్లెక్టర్ ఎరే (ఎల్‌ఆర్‌ఎ).. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని లొకేషన్ మార్కర్ సేవలను పునరుద్ధరించిందని వివరించారు.
చంద్రయాన్–3 ప్రయోగంలో భాగంగా అందులో పలు సంస్థలకు చెందిన ఎల్‌ఆర్‌ఎలను అమర్చిన విషయాన్ని ఇస్రో అధికారులు ఈ సందర్భంగా గుర్తుచేశారు. అందులో నాసాకు చెందిన ఎల్‌ఆర్‌ఎ నిరంతరం పనితీరు కనబరుస్తూనే ఉందని వారు వెల్లడించారు. డిసెంబరు 12 నుంచి ఎల్‌ఆర్‌ఎ నుంచి తమకు సంకేతాలు అందినట్లు వారు తెలిపారు. దక్షిణ ధ్రువంలోని రాత్రి సమయాల్లో ఎల్‌ఆర్‌ఏ పర్యవేక్షణ మొదలవుతుందని, చంద్రయాన్–3 నుంచి తూర్పు వైపునకు మళ్లి ఉన్న ఎస్‌ఆర్డీలోని లేజర్ అల్టిమీటర్ (లోలా) చంద్రయాన్–3 ఉండే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు అందించగలుగుతోందని వివరించారు. ఇందులోని 8 ఫలకల రెట్రో రిఫ్లెక్టర్లు దక్షిణ ధ్రువంలోని వాతావరణానికి అనువుగా ఏర్పాటయ్యాయని తెలిపారు. దాదాపు 20 గ్రాముల బరువుండే ఈ పరికరం పదేళ్ల పాటు చంద్రుని ఉపరితలంపై మనుగడ సాగించే సామర్థ్యంతో రూపొందించినట్టు వెల్లడించారు.