Telugu Global
National

ఆదిత్య ఎల్-1 లాంచ్‌ రిహార్సల్‌ సక్సెస్‌...స్పేస్ సెక్టార్‌లో నెంబర్ వన్‌గా ఇండియా..!

సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న ఫస్ట్‌ మిషన్‌ ఇదే. ఈ ఉపగ్రహం బరువు దాదాపు 1500 కిలోలు. సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంలో దాని ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం చేపడుతున్నారు.

ఆదిత్య ఎల్-1 లాంచ్‌ రిహార్సల్‌ సక్సెస్‌...స్పేస్ సెక్టార్‌లో నెంబర్ వన్‌గా ఇండియా..!
X

చంద్రయాన్​-3 మిషన్‌ సక్సెస్‌తో జోరుమీదున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఆదిత్య-ఎల్‌1 ప్రయోగానికి రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించి లాంచ్‌ రిహార్సల్‌, రాకెట్‌ అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయని బుధవారం ఇస్రో ట్వీట్ చేసింది. ఈ శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్‌ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది ఇస్రో. కొరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని అధ్యయనం చేయడమే ఆదిత్య ఎల్‌-1 ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం

ఇక ప్రయోగంలో భాగంగా భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రేంజ్‌ పాయింట్‌ ఎల్‌-1 చుట్టూ ఉన్న కక్ష్యలో ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సూర్యుడిపై పరిశోధనలకు అంతరిక్షంలో తొలి భారతీయ అబ్జర్వేటరీగా ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ పనిచేయనుంది. ఆదిత్య ఎల్‌-1ను వివిధ జాతీయ సంస్థల భాగస్వామ్యంతో దేశీయంగానే తయారు చేసినట్లు ఇస్రో తెలిపింది.

సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న ఫస్ట్‌ మిషన్‌ ఇదే. ఈ ఉపగ్రహం బరువు దాదాపు 1500 కిలోలు. సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంలో దాని ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం చేపడుతున్నారు. ఆదిత్య-ఎల్‌ 1లో మొత్తం ఏడు పేలోడ్లు ఉన్నాయి. ఇందులో ప్రధానమైన విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌తో పాటు సోలార్‌ అవైలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌, ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌, ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య, సోలార్‌-లో-ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, హైఎనర్జీ ఎల్‌-1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, మ్యాగ్నెటోమీటర్‌ పేలోడ్‌లను అమర్చనున్నారు. సూర్యుడి నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు వీలుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు.

First Published:  30 Aug 2023 4:57 PM IST
Next Story