Telugu Global
National

కాంగ్రెస్ ముక్త భారత్ అనే బీజేపీ టార్గెట్ ను 'ఆప్' పూర్తి చేస్తున్నదా ?

కాంగ్రెస్ పార్టీని ఉత్తరాదిన నాశ‌నం చేయడానికి బీజేపీకి కలిసి వచ్చిన అవకాశం 'ఆప్'. గుజరాత్ లో ఆప్ సాధి‍ంచిన 13 శాతం ఓట్లు మొత్తం కాంగ్రెస్ కు రావాల్సినవే అనే వాదన ఉంది. ఆప్ ప్రధాన పోటీ దారుగా ఉండకూడదు, కానీ పోటీలో ఉండి కాంగ్రెస్ ఓట్లను చీల్చాలి... ఇదీ బీజేపీ ఆశించింది. ఆ పార్టీ ఆశను ఆప్ తీర్చింది.

కాంగ్రెస్ ముక్త భారత్ అనే బీజేపీ టార్గెట్ ను ఆప్ పూర్తి చేస్తున్నదా ?
X

గుజరాత్ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఉన్న ఐక్యత, ఘర్షణ అనే ఒక వైరుధ్యభరితమైన సంబంధాన్ని సూచిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీని ఉత్తరాదిన నాశ‌నం చేయడానికి బీజేపీకి కలిసి వచ్చిన అవకాశం 'ఆప్'. గుజరాత్ లో ఆప్ సాధి‍ంచిన 13 శాతం ఓట్లు మొత్తం కాంగ్రెస్ కు రావాల్సినవే అనే వాదన ఉంది. ఆప్ ప్రధాన పోటీ దారుగా ఉండకూడదు, కానీ పోటీలో ఉండి కాంగ్రెస్ ఓట్లను చీల్చాలి... ఇదీ బీజేపీ ఆశించింది. ఆ పార్టీ ఆశను ఆప్ తీర్చింది.

2017 గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ 41% ఓట్లను గెలుచుకుంది, కానీ ఈసారి అది 14 శాతం ఓట్లను కోల్పోయింది. దాని ఓట్ల శాతం 27%కి తగ్గింది, అయితే AAPకి 13% ఓట్లు వచ్చాయి. దీనివల్ల బీజేపీ గతంలో కన్నా 57 అదనపు సీట్లు సాధించి రికార్డు సృష్టించింది. గుజరాత్ బీజేపీ నేతలు పైకి ఎన్ని మాటలుమాట్లాడినా లోపల మాత్రం కేజ్రీవాల్ కు కృతజ్ఞతలు చెప్పుకునే ఉంటారు.

ఢిల్లీలో బీజేపీ కోరుకున్నట్టే కాంగ్రెస్ ను మూడవ స్థానానికి నెట్టివేయగలిగారు. ఆప్ అధికారంలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ సోదిలో కూడా లేకపోవడం బీజేపీకి ఆనందాన్నిస్తున్నది. అదే విధంగా తమకేమాత్రం స్థానం లేని పంజాబ్ లో కాంగ్రెస్ ను ఓడించి ఆప్ అధికారంలోకి రావడం బీజేపీ కోరుకున్నదే.

గుజరాత్ లో 'ఆప్' ప్రయత్నానికి విఘాతం కలగకుండా చూసేందుకు మోడీ, షా గత కొన్ని నెలలుగా సాధ్యమైనదంతా చేశారు. కాంగ్రెస్‌కు బలమైన కోటగా ఉన్న సౌరాష్ట్రలో AAP 20% ఓట్లు సాధించి కాంగ్రెస్ ను కోలుకోలేకుండా చేసి బీజేపీ గెలుపుకు సహాయపడింది. గుజరాత్ గ్రామీణ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ కు తీవ్ర నష్టం కలిగించగలిగింది ఆప్. మొత్తంగా గుజరాత్ లో ఆప్ గెల్చుకున్న సీట్లు 5 మాత్రమే దాదాపు 120 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఒకవైపు బీజేపీతో పోరాడుతూనే , కాంగ్రెస్ ను ఓడించడానికి బీజేపీకి పరోక్షంగా సహకరిస్తున్నది.

గుజరాత్ ఫలితాలు ఆప్ జాతీయ పార్టీగా అవతరించేందుకు సహాయపడ్డాయి. ఇక‌ వచ్చే ఏడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కూడా కేజ్రీవాల్ మరింత దూకుడుగా ముందుకు సాగడానికి ఈ ఫలితాలు వీలు కల్పిస్తున్నాయి. ఇది కాంగ్రెస్‌కు మళ్లీ నష్టం కలిగించవచ్చు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఎప్పుడూ ప్రత్యక్ష పోరు సాగుతోంది. గుజరాత్‌లో లాగా ఆ రెండు రాష్ట్రాల్లో కూడా ఆప్ కాంగ్రెస్ ను దెబ్బ తీసి బీజేపీని గెలిపించే శక్తిగా ఆవిర్భవించవచ్చు. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ఏం చేస్తుందో చూడాలి.

First Published:  10 Dec 2022 3:54 PM IST
Next Story